వైరల్ సాంగ్ : భోజనం ప్లేట్లు పట్టుకుని ‘జెరూసలేమా..’ అంగోలన్ డ్యాన్స్

  • Published By: nagamani ,Published On : November 3, 2020 / 10:57 AM IST
వైరల్ సాంగ్ : భోజనం ప్లేట్లు పట్టుకుని ‘జెరూసలేమా..’ అంగోలన్ డ్యాన్స్

Angolan dance troup song : కొన్ని పాటలు ప్రాంతాలకు అతీతంగా వైరల్ అవుతాయి. పాట అంటే కళ..కళలకు భాష, ప్రాంతీయం బేధాలులుండవనీ ఎన్నో పాటలు నిరూపించాయి. అటువంటిదే ‘‘జెరూసలేమా..’’పాట. సౌతాఫ్రికాలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘జెరూసలేమా… ఇకయ్యా లామీ’ (జెరూసలేం నా ఇల్లు)అనే పాట గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ పాటు గతంలోనే విడుదలై వైరల్ గా మారింది.



పువ్వుకు తావిలాగా ఇప్పుడు ఇదే పాటకు ‘‘ఆంగోలన్ డ్యాన్స్ ట్రూప్’’ చేసిన డ్యాన్స్ తో ఆ పాట మరింతగా వైరల్ గా మారింది. ప్రపంచ సంగీత, నృత్య శ్రోతలను ఉర్రూతలూగిస్తోంది. అంగోలన్ డ్యాన్స్ ట్రూప్ విభిన్న పద్ధతిలో డ్యాన్స్ చేసి ఆ పాటకు మరింత వన్నెతెచ్చారు. ఈ డ్యాన్స ట్రూమ్ అంటూ తమ చేతుల్లో ప్లేట్లు పట్టుకుని భోజనం చేస్తూ..చేసిన డ్యాన్స్ కు ప్రపంచం ఫిదా అయిపోయింది. ఈ పాట వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.



కరోనా వైరస్ విజృంభిస్తున్న రోజుల్లో, భౌతిక దూరాన్ని పాటిస్తూ, ఈ పాటకు ఆంగోలన్ డ్యాన్స్ ట్రూప్, ‘జెరూసలేమా డ్యాన్స్ చాలెంజ్’ని విసరగా… రోజుల వ్యవధిలోనే ఆఫ్రికా పోలీసు అధికారుల నుంచి, యూరప్ లోని మతాధికారుల వరకూ దీన్ని స్వీకరించి, తమతమ నృత్యాలను పోస్ట్ చేయడం గమనించాల్సిన విషయం.



ఈ పాటలో ‘జెరూసలేమా..’ అనే పదంలో ‘ఆశ’ అనే అర్థం కూడా ఉండటంతో కరోనా నుంచి ప్రపంచం త్వరగా బయట పడాలని కోట్లాది మంది కోరుకుంటున్నారు. ఈ పాటను జొహనాస్ బర్గ్ నగరానికి చెందిన సంగీత కళాకారుడు మాస్టర్ కేజీ రూపొందించారు. నవంబర్ 2019లో ఈ పాటకు రూపకల్పన జరిగింది. కాగా, జెరూసలేమ్ నగరం మూడు మతాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన నగరమన్న సంగతి తెలిసిందే.
https://youtu.be/Ml-IniZddzM