మొజాంబిక్ ను భయపెడుతున్న కెన్నిత్ తుఫాన్

  • Published By: venkaiahnaidu ,Published On : April 26, 2019 / 01:53 AM IST
మొజాంబిక్ ను భయపెడుతున్న కెన్నిత్ తుఫాన్

 మొజాంబిక్ దేశాన్ని మరోసారి తుపాన్ వణికిస్తోంది.నెల రోజుల క్రితమే ఇడాయ్ తుపాన్ భీభత్సంతో మొజాంబిక్,మాలావి,జింబాబ్వే లో 900మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం విషయం తెలిసిందే. మళ్లీ కెన్నిత్ తుఫాన్ ఆ దేశ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.కెన్నిత్ తుపాన్ వల్ల గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీని కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. గత అనుభాల దృష్యా ముందుగానే అధికారులు అలర్ట్ అయ్యారు.

 ముందుజాగ్రత్త చర్యగా తుఫాను ప్రభావానికి గురయ్యే అవకాశముందని భావిస్తున్న ప్రాంతాల నుంచి 30వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మొజాంబిక్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్(INGC) తెలిపింది.  తుపాన్ వల్ల 600 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశముందని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం అధికారులు హెచ్చరించారు. మొజాంబిక్ లోని తీర ప్రాంతాల్లో ఉన్న ఐదు నదులు వరదనీటి ధాటికి తెగిపోయి వరదనీరు జనవాసాలను ముంచెత్తింది. ఐక్యరాజ్యసమితి, రెడ్ క్రాస్ తోపాటు ఇతర అంతర్జాతీయ సహాయ సంస్థలు సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు వచ్చాయి.