ఫేస్‌బుక్‌కు పోటీగా యాప్.. ఒక్క వారంలో 15మిలియన్ల డౌన్‌లోడ్లు

ఫేస్‌బుక్‌కు పోటీగా యాప్..  ఒక్క వారంలో 15మిలియన్ల డౌన్‌లోడ్లు

Anti-Facebook MeWe: సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ నుంచి యూజర్లు దూరంగా జరుగుతున్నారు. ప్రైవసీ ఉల్లంఘనకు పాల్పడటంతో పాటు నిఘా పెంచి, రాజకీయకోణంలో, టార్గెట్ చేయడం, న్యూస్ ఫీడ్ ను మ్యానిప్యులేషన్ వంటివి చేస్తున్నాయి కంపెనీలు. ఇటువంటి పనులతో ఇతర సోషల్ మీడియా కంపెనీలు బెనిఫిట్ పొందుతున్నాయి.

లాస్ ఏంజిల్స్ లో ఉన్న సోషల్ మీడియా నెట్ వర్క్ MeWe.. సోషల్ నెట్‌వర్క్ యాడ్ ఫ్రీగా కొనసాగనుంది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ డౌన్ లోడింగ్‌లో నెం.3గా.. సోషల్ మీడియాలో నెం.1గానూ కొనసాగుతుంది. 2016లో లాంచ్ చేసినప్పటి నుంచి అక్టోబర్ 2020 నాటికి 9మిలియన్ మంది యూజర్లు వచ్చేశారు.

ప్రస్తుతం ఈ ప్లాట్ ఫాంపై 15.5మిలియన్ మంది సభ్యులు ఉండగా.. వారిలో సగం నార్త్ అమెరికాకు బయటివారే. ఇంకా MeWe 20భాషల్లోనూ ట్రాన్స్ లేట్ అవగల యాప్.. హాంకాంగ్ లో నెం.1సోషల్ యాప్ గా కొనసాగుతుంది.

డేటాను షేర్ చేయడానికి, టార్గెట్, లేదా అమ్మడానికి వీలు కాని సోషల్ మీడియా యాప్ లో మెంబర్ షిప్ పీక్స్ లో పెరిగిపోయింది. ప్రజల నుంచి ప్రేమ మాత్రమే ఉంటూ నో యాడ్స్, నో టార్గెటింగ్, నో న్యూస్ ఫీడ్ తో దూసుకుపోతుంది. ప్రపంచంలోనే 2021 జనవరి 15నాటికి నెం.3యాప్ గా నిలిచింది.

వాట్సప్ కు ప్రత్యామ్నాయంగా సిగ్నల్, టెలిగ్రామ్ లు రంగంలోకి దిగగా, ఫేస్‌బుక్‌కు ప్రత్యామ్నాయంగా MeWeనిలిచింది. యాడ్ ఫ్రీగా నడుస్తుండటంతో యూజర్లకు మరింత కన్వినెంట్ గా మారనుంది. ఎక్స్ ట్రా ఫీచర్లతో ప్రీమియం మోడల్స్ ను మించిపోయేలా ఉంది.