Antiguan PM: చోక్సీ కిడ్నాప్ కు ఆధారాల్లేవ్

తనను ఆంటిగ్వా నుంచి కిడ్నాప్ చేసి డొమినికా తీసుకెళ్లారంటూ పీఎన్ బీ స్కామ్ నిందితుడు మొహుల్ చోక్సీ చేసిన ఆరోపణలును ఆంటిగ్వా ప్రధాని కొట్టిపారేశారు.

Antiguan PM: చోక్సీ కిడ్నాప్ కు ఆధారాల్లేవ్

Antigua Pm

Antiguan PM తనను ఆంటిగ్వా నుంచి కిడ్నాప్ చేసి డొమినికా తీసుకెళ్లారంటూ పీఎన్ బీ స్కామ్ నిందితుడు మొహుల్ చోక్సీ చేసిన ఆరోపణలును ఆంటిగ్వా ప్రధాని కొట్టిపారేశారు. చోక్సీని కిడ్నాప్ చేసిన‌ట్లు ఎటువంటి స‌రైన ఆధారాలు లేవ‌ని అంటిగ్వా ప్ర‌ధాని గాస్టోన్ బ్రౌనే తేల్చి చెప్పారు. బుధవారం అంటిగ్వా-బార్బుడా పార్ల‌మెంట్‌లో విప‌క్ష ఎంపీలు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ప్రధాని గాస్టోన్ బ్రౌనే స‌మాధాన‌మిస్తూ.. స్కాట్లాండ్ యార్డ్ లేదా ఏదేనీ ద‌ర్యాప్తు సంస్థ విచార‌ణ‌లో కూడా చోక్సీని కిడ్నాప్ చేసి డొమినికాకి తీసుకెళ్లినట్లు ఎటువంటి ఆధారాలు లేవ‌న్నారు. కానీ ప‌బ్లిక్ డొమైన్స్‌లో మాత్రం చౌక్సీని అప‌హ‌రించిన‌ట్లు ఉంద‌న్నారు.

అదేవిధంగా, ఆంటిగ్వా లా ఎన్ ఫోర్స్ మెంట్ కూడా కొంత పరిశోధన చేసినట్లు తనకు తెలుసన్నారు. బహుశా కొంతమంది వ్యక్తులకు ఆసక్తి ఉండవచ్చు, కానీ సాక్ష్యాలకు సంబంధించినంతవరకు.. అలాంటి నిశ్చయాత్మకమైన ఆధారాలు(conclusive evidence)ఉన్నాయని నాకు తెలియదు అని గాస్టోన్ బ్రౌనే అన్నారు. కాగా,మే 23న చోక్సీ..డొమినికాలోకి అక్రమంగా ప్రవేశించారంటూ అక్కడి పోలీసులు నమోదు చేసిన కేసుపై స్థానిక న్యాయస్థానం విచారణ జరుపుతోంది. చోక్సీని త్వరలోనే భారత్ కు తీసుకిొచ్చేందుకు సీబీఐ,ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.