Gold mines : బంగారు గని కార్మికుల మధ్య ఘర్షణ..100 మంది మృతి

బంగారు గనిలో కార్మికుల మధ్య తలెత్తిన వివాదం కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో దాదాపు 100మంది మృతి చెందారు.

Gold mines : బంగారు గని కార్మికుల మధ్య ఘర్షణ..100 మంది మృతి

Around 100 Dead In Gold Miners

Gold mines: బంగారు గనిలో కార్మికుల మధ్య తలెత్తిన వివాదం కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో దాదాపు 100మంది మృతి చెందారు.ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన గొడవకాస్తా ఇంతటి దారుణానికి దారి తీసిన ఘటన ఆఫ్రికాలోని లిబియా సరిహద్దుకు సమీపంలోని కౌరీ బౌగౌడి వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి రక్షణ మంత్రి దావూద్ యాయా బ్రాహిమ్ మాట్లాడుతూ..“ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన వివాదంగా మొదలై ఘర్షణకు దారి తీసిందని..తెలిపారు.

లిబియా సరిహద్దుకు సమీపంలో ఉన్న పర్వత ప్రాంతాలైన కౌరీ బౌగౌడి జిల్లా చాద్‌లో ఉన్న గనుల్లో ఈ ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలు గత వారం (మే 23,2022)జరుగగా..ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఘర్షణల్లో 100మంది ప్రాణాలు కోల్పోయాని మరో 40మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. ముఖ్యంగా టామా వర్గానికి, ఓ అరబ్‌ గ్రూపునకు మధ్య తాజా ఘర్షణలు చోటుచేసుకున్నట్లు సమాచారం. కాగా..ఈ ప్రాంతంలో బంగారు గని కార్మికుల మధ్య హింస జరగడం ఇదే మొదటిసారి కాదు.

సైనిక బృందం ఈ ప్రాంతంలో ప్రశాంతతను పునరుద్ధరించింది. మౌరిటానియా, లిబియాకు చెందిన వ్యక్తుల మధ్య ఘర్షణలు జరిగినట్లు స్థానికులు చెప్పారు. అయితే గత వారం, చాద్ జాతీయ మానవ హక్కుల కమిషన్ అధిపతి మహమత్ నూర్ ఇబెడౌ మాట్లాడుతూ..జోక్యం చేసుకోవడానికి పంపిన సైనికులు ప్రజలపై కాల్పులు జరిపారు అని మీడియా తెలిపింది.

ఈ ప్రాంతంలో బంగారు గని కార్మికుల మధ్య హింస జరగడం ఇదే మొదటిసారి కాదని మంత్రి తెలిపారు. తదుపని నోటీసులు వచ్చేంత వరకు బంగారు గనుల్లో తవ్వకాలు నిలిపివేయాలని నిర్ణయించామని మంత్రి యాయా బ్రాహిమ్ తెలిపారు. కాగా..100మంది చనిపోయినట్లుగా ప్రభుత్వం చెబుతున్నా…ఈ ఘర్షణల్లో 200లమంది వరకు చనిపోయి ఉంటారని మీడియా భావిస్తోంది.