Child Labour : చిన్నారులపై కరోనా పడగ..భారీగా పెరుగుతున్న బాల కార్మికులు..UNO ఆందోళన

కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా బాలకార్మికుల సంఖ్య భారీగా పెరిగిపోతోందని UNO ఆందోళన వ్యక్తంచేసింది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం గత 20 ఏళ్లుగా తీసుకుంటున్న చర్యల వల్ల తగ్గుముఖం పట్టిందని..కానీ ఈ కరోనా కష్టం వల్ల మరోసారి బాల కార్మికుల సంఖ్య పెరుగుతుండటం పట్ల UNO ఆందోళన వ్యక్తంచేసింది.

Child Labour : చిన్నారులపై కరోనా పడగ..భారీగా పెరుగుతున్న బాల కార్మికులు..UNO ఆందోళన

Child Labour (1)

Corona Effect Increasing Child Labour : కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.మరెంతోమంది రోడ్డున పడ్డారు.ఇంకెందరి జీవితాలు ఛిన్నాభిన్నమైపోయాయి. ఫలితంగా చిన్నారులపై కూడా కరోనా పడగ పడింది. బాల్యాన్ని కాలరాస్తోంది.కరోనాతో మూత పడిన బడులు..ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు. ఫలితంగా చిన్నారుల చిట్టి చేతులు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. కరోనా వల్ల బాల కార్మికుల సంఖ్య భారీగా పెరిగిందని అధ్యయనాల్లో తేలింది. గతంలో ఉన్న బాల కార్మికుల సంఖ్య ఈ కరోనా కాటు వల్ల మరింతగా పెరిగిందని తేలింది. గడిచిన 20 ఏళ్లుగా బాల కార్మికుల విషయంలో కనిపిస్తున్న మెరుగుదల కరోనా దెబ్బకు కకావికలమైంది. మరోసారి రికార్డు స్థాయిలో బాల కార్మికుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయిందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఐక్యరాజ్య సమితి చైల్డ్‌ లేబర్‌ గ్లోబల్‌ ఎస్టిమేట్స్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్లమంది బాల కార్మికులు ఉన్నట్లుగా తేలింది. దీంతో బాలకార్మిక వ్యవస్థను రూపు మాపటానికి..క్రమేసీ తగ్గించటానికి తీసుకున్న చర్యల ఫలితంగా బాల కార్మికుల సంఖ్య 20 ఏళ్లుగా క్రమేపీ తగ్గుతూ వచ్చింది. కానీ ఈ కరోనా వల్ల మరోసారి బాల కార్మికుల సంఖ్య ఒక్కసారిగా అంటే భారీగా పెరిగిందని ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌వో) వెల్లడించింది. 2001 నుంచి 2016 వరకు ప్రపంచవ్యా్తంగా 9.4 కోట్ల మంది బాలకార్మికులు ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.

ఈక్రమంలో కరోనా ప్రభావంతో 2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా మరో 90 లక్షల మంది చిన్నారులు బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉందని యూఎన్‌వో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందులో 46 లక్షల మంది బాలలు అనాథలుగా మారడం లేదా సామాజిక భద్రతకు దూరమవుతారని వెల్లడించింది. కాగా కరోనాతో తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల సంఖ్య కూడా పెరుగుతున్న విషయం తెలిసిందే.

2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో 5 నుంచి 14 ఏళ్ల వయస్సు ఉన్న వారి సంఖ్య 25.6 కోట్లుగా ఉంది. ఇందులో నాలుగో వంతు మంది పిల్లలు బాల కార్మిక వ్యవస్థలో మగ్గిపోతున్నారు. భారతదేశం వ్యాప్తంగా కరోనా వల్ల 1.5 మిలియన్ల స్కూళ్లు మూత పడ్డాయని యూనిసెఫ్ వెల్లడించింది. ఈ క్రమంలో స్కూళ్లకు దూరమై..కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు పెరగటం ఫలితంగా భారత్ లో బాల కార్మికులు సంఖ్య పెరిగటానికి కారణమవుతోందని తెలుస్తోంది.కరోనా 247 మిలియన్ల పిల్లలపై ప్రభావం చూపిందని తెలిపింది. దీంతో చిన్నారులు భద్రతలేని పరిస్థితులకు నెట్టబడుతున్నారని యునిసెఫ్ తెలిపింది. కరోనా కారణంగా 2021 మే 31 వరకు దేశ వ్యాప్తంగా పది వేల మంది పిల్లలు అనాథలుగా మారినట్ట్టు కేంద్ర ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి.