ఇంటి ధరను పెంచేసిన ‘చీదుతున్న ముసలమ్మ’ ఆర్ట్

  • Published By: madhu ,Published On : December 14, 2020 / 10:00 AM IST
ఇంటి ధరను పెంచేసిన ‘చీదుతున్న ముసలమ్మ’ ఆర్ట్

artwork-was-found-on-the-side-of-a-house : ఇంటిని అమ్మకానికి పెడితే..ఒక్కోసారి సరియైన ధర రాదు. దీంతో కొన్ని మరమ్మత్తులు చేయడం, కలర్స్, ఇతరత్రా చేయడం ద్వారా మంచి గిరాకీ వస్తుంటుంది. ఇలాగే..ఓ మహిళ తన ఇంటిని అమ్మకానికి పెట్టింది. కానీ..ఎంతకూ ఇంటిని కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడం..వచ్చినా సరియైన ధర రాకపోవడంతో ఆమె తీవ్ర నిరుత్సాహానికి గురైంది. ఒక్కసారిగా ఆమె మెదడులో బల్బు వెలిగింది. వెంటనే గోడపై భారీ పెయింటింగ్ వేయించింది. అమాంతం ఆమె ఇంటి ధర రెట్టింపు కావడం విశేషం. ఈ ఘటన ఇంగ్లండ్ నగరంలోని బ్రిస్టల్ నగరంలో చోటు చేసుకుంది.

వేల్ స్ట్రీట్.. ఇది అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి. ఐలిన్ మాకీన్ అనే మహిళ ఈ ప్రాంతంలో నివాసం ఉంటోంది. కొన్ని కారణాల వల్ల..తన ఇంటిని సేల్ పెట్టింది. ఇంటి ధర రూ. 3 లక్షల డాలర్లుగా ప్రకటించింది. కానీ..ఎవరూ ఇంటిని కొనడానికి ఆసక్తి చూపలేదు. చివరకు కొనుగోలు దారులను ఆకట్టుకొనేందుకు వినూత్నంగా ప్రయత్నించింది. రాత్రికి రాత్రే ఇంటి గోడపై భారీ పెయింటింగ్ వేయిపించింది. తెల్లారి ‘ముక్కు చీదుతున్న’ ముసలమ్మ ఆర్ట్ ను చూసి జనాలు ఆశ్చర్యపోయారు. తాను గీసిన పెయింటింగ్‌ ను సోషల్ మీడియాలో కళాకారుడు పోస్టు చేశారు.

ఈ ఫొటో కాస్తా వైరల్‌గా మారిపోయింది. ఇంటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఓ వీధి చిత్రకారుడు గీసిన పెయింటింగ్ ఆ ఇంటికే మంచి కళ తీసుకొచ్చిందని అంటున్నారు. ఇంటి ధర కాస్త 17 రెట్లు పెరిగిపోవడం విశేషం. ప్రస్తుతం ఆ ఇంటిని 4 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తామంటున్నారు. ఇంటిని ఎప్పుడైనా అమ్మేస్తామని యజమానురాలి కొడుకు నికొలస్ వెల్లడించాడు. చూశారా..ఒక్క పెయింటింగ్ ఎంత మార్చేసింది.