Pakistan: సాయం అడిగేందుకు సిగ్గుపడుతున్నా.. అయినా తప్పట్లేదు: పాక్ ప్రధాని

ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు సాయం చేయాల్సిందిగా పాక్, తన మిత్ర దేశాల్ని కోరుతోంది.

Pakistan: సాయం అడిగేందుకు సిగ్గుపడుతున్నా.. అయినా తప్పట్లేదు: పాక్ ప్రధాని

Pakistan: పొరుగు దేశాల్ని సాయం చేయమని అడుగుతున్నందుకు సిగ్గపడుతున్నానని, అయినప్పటికీ తాము నిస్సహాయులమని, అందుకే తప్పట్లేదని వ్యాఖ్యానించారు పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్.

Pawan Kalyan: ‘వారాహి’కి పూజ.. కొండగట్టుకు జనసేనాని పవన్ కల్యాణ్

ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు సాయం చేయాల్సిందిగా పాక్, తన మిత్ర దేశాల్ని కోరుతోంది. దీంతో పలు దేశాలు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా సౌదీ అరేబియా భారీ సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే రెండు బిలియన్ అమెరికన్ డాలర్ల సాయం అందించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంగీకరించగా, అదనంగా మరో బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు సౌదీ అరేబియా ముందుకొచ్చింది.

Peddi Reddy: కుప్పంలో చంద్రబాబుపై పోటీకి సిద్ధం.. మంత్రి పెద్దిరెడ్డి సవాల్

ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ఆయా దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మిత్ర దేశాల్ని సాయం అడిగేందుకు సిగ్గు పడుతున్నా. కానీ, మేం నిస్సహాయులం. అందుకే తప్పట్లేదు. సాయం చేయమని పొరుగు దేశాల్ని కోరుతున్నా. అయితే, ఆర్థిక సాయం వల్లో లేదా రుణం వల్లో సమస్య తీరదు. ఇది పాక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. ఎందుకంటే తీసుకుంటున్న రుణాల్ని తిరిగి చెల్లించాల్సిందే. 75 ఏళ్లుగా దేశాన్ని పాలించిన నేతలు, మిలిటరీ నియంతలు ఎవరూ దేశ ఆర్థిక స్థితిని గుర్తించలేదు” అని షెబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు.

Rishabh Pant: ప్రమాదం తర్వాత పంత్ తొలి ట్వీట్.. సర్జరీ గురించి ఏం చెప్పాడంటే

ప్రస్తుతం పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఆ దేశం దగ్గర విదేశీ మారక నిల్వలు 5.8 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఫిబ్రవరి 2014 తర్వాత ఈ స్థాయిలో ఆర్థిక స్థితి దిగజారడం ఇదే మొదటిసారి. ఈ విదేశీ మారక నిల్వలు కూడా చైనా, సౌదీ అరేబియా దగ్గర దాచి ఉంచిన 5 బిలియన్ డాలర్లతో కలిపి ఉండటం గమనార్హం. ఈ నిల్వల్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వాడుకోవచ్చు.