Shooting In Israel 7 Killed : ఇజ్రాయెల్ లోని ప్రార్థనామందిరంలో కాల్పులు.. ఏడుగురు మృతి
ఇజ్రాయెల్ లో కాల్పులు కలకలం రేపాయి. జెరూసలెంలోని ప్రార్థనామందిరంలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Shooting In Israel 7 Killed : ఇజ్రాయెల్ లో కాల్పులు కలకలం రేపాయి. జెరూసలెంలోని ప్రార్థనామందిరంలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. జెరూసలెంలోని ఓ ప్రార్థనామందిరంలో సబ్బత్ వేడుకల్లో పాల్గొన్న పౌరులపై పాలస్తీనాకు చెందిన దుండగుడు కాల్పులు జరిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇజ్రాయెల్ దళాలు దుండగుడిని కాల్చి చంపారు. అంతకముందు వెస్ట్ బ్యాంక్ లోని పాలస్తియన్ శరణార్థుల శిబిరంపై దాడికి పాల్పడిన ఇజ్రాయెల్ సైన్యం 9 మందిని కాల్చి చంపింది. అందుకు ప్రతీకారంగా దుందగుడు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. గతంలో ఇజ్రాయెల్ లో జరిగిన కాల్పుల ఘటనల్లో పలువురు మృతి చెందారు.
మార్చి 30, 2022న ఇజ్రాయిల్ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. టెల్ అవివ్ శివారులోని బినెయి బ్రాక్ ప్రాంతంలో ఓ దుండగుడు తుపాకి పట్టుకుని వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అల్ట్రా-ఆర్థోడాక్స్ యూదు ప్రాంతాలలో ఒకటైన బినెయి బ్రాక్ ప్రాంతంలో యూదులు అధిక సంఖ్యలో ఉంటారు. ఈ ప్రాంతంలో దుండుగుడు తుపాకితో కాల్పులు జరుపగా ఐదుగురు చనిపోయాడు. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగుడిని కాల్చి చంపారు. ఇజ్రాయెల్ మీడియా నివేదికలు ప్రకారం..దాడి చేసిన వ్యక్తి 27 ఏళ్ల పాలస్తీనియన్ అని ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌కు ఉత్తరాన ఉన్న గ్రామానికి చెందినవాడు అని వెల్లడించింది.
Shireen Abu Akleh: ఇజ్రాయెల్ కాల్పుల్లో రిపోర్టర్ మృతి
గతంలో ఇజ్రాయెల్ అరబ్బులు జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు. ఈ దాడులతో సెక్యూర్టీ దళాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందారు. నల్ల దుస్తులు ధరించి, చేతిలో అటోమెటిక్ వెపన్‌తో ఉన్న వాహనంపై వచ్చిన ఆ దుండగుడు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపాడు. ఒకరు వాహనంలో చనిపోగా, మరికొంత మంది వీధుల్లో చెల్లాచెదురుగా పడి మృతి చెందారు.