Appearing, Disappearing Stars : తళుక్కున మెరుస్తాయి, అంతలోనే మాయం అవుతాయి.. వింత నక్షత్రాలు

ఖగోళ శాస్త్రవేత్తలు వింత నక్షత్రాలను గుర్తించారు. అవి తళుక్కున మెరుస్తాయి. ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అంతలోనే మాయం అవుతాయి.

Appearing, Disappearing Stars : తళుక్కున మెరుస్తాయి, అంతలోనే మాయం అవుతాయి.. వింత నక్షత్రాలు

Appearing, Disappearing Stars

Appearing, Disappearing Stars : ఖగోళ శాస్త్రవేత్తలు వింత నక్షత్రాలను గుర్తించారు. అవి తళుక్కున మెరుస్తాయి. ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అంతలోనే మాయం అవుతాయి. ఈ వింత నక్షత్రాలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. 9 నక్షత్రాల లాంటి ఆబ్జెక్ట్స్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఓ చిన్న ప్రాంతంలో అవి మెరుస్తూ, అంతలోనే(అరగంట) మాయం అవుతున్నాయి. పాత ఫొటోగ్రాఫిక్ ప్లేట్ సాయంతో వాటిని గుర్తించారు.

భారత్, స్వీడెన్, స్పెయిన్, అమెరికా, ఉక్రెయిన్ కి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధన జరుపుతున్నారు. చీకటి ఆకాశంలో చిత్రాలను క్యాప్చర్ చేసేందుకు గతంలో గ్లాస్ ప్లేట్స్ వాడారు. ఆ తరహా ఫొటోగ్రఫీపై వారు పరిశోధనలు జరుపుతున్నారు. 1950 ఏప్రిల్ 12న చీకటి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులను ఫొటోలు తీశారు. వాటిని కాలిఫోర్నియాలోని పాలోమర్ అబ్జర్వేటరీలో పరిశోధిస్తున్నారు. నక్షత్రాల్లా మెరుస్తూ అంతలోనే మాయం అవుతున్న ఆ 9 ఆబ్జెక్ట్స్ ఏంటి? అనేది ఇంతవరకు ఎవరూ కనుగొనలేదు. దీన్ని ట్రేస్ చేసే పనిలో ఖగోళ శాస్త్రవేత్తలు ఉన్నారు. ఆస్ట్రానమీ చరిత్రలోనే తొలిసారిగా ఈ వింత నక్షత్రాలను గుర్తించడం జరిగిందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇంతకీ ఆ 9 ఆబ్జెక్ట్స్ ఏంటి? ఎందుకు మెరుస్తున్నాయి? అంతలోనే ఎక్కడికి మాయమైపోతున్నాయి? ఈ గుట్టు కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. చీకటి ఆకాశంలో తీసిన పాత చిత్రాలను పోల్చి చూస్తూ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ 9 ఆబ్జెక్ట్స్ లో నక్షత్రాల లాంటి వస్తువులు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే అవి ఏంటి? అనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేము అన్నారు.