పుట్టుకొస్తున్న మరో గ్రహం.. సాక్ష్యం చూపిస్తున్న Astronomers

  • Published By: Subhan ,Published On : May 21, 2020 / 07:04 AM IST
పుట్టుకొస్తున్న మరో గ్రహం.. సాక్ష్యం చూపిస్తున్న Astronomers

Astronomers కొత్త గ్రహం పుట్టుకను కనుగొన్నామని దానికి సాక్ష్యం కూడా దొరికిందని అంటున్నారు. భూమికి 520 కాంతి సంవత్సరాల దూరంలో దూరంలో దుమ్ము, గ్యాస్ ఉన్నట్లు గుర్తించారు. దానికి పేరు ఏబీ ఔరిగా అని కూడా పేరు పెట్టారు. చిలేలో ఉన్న యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ వెరీ లార్జ్ టెలిస్కోప్ (VLT)నుంచి దీనిని గమనించారు. 

కేంద్రం నుంచి దాని నిర్మాణంలో ఓ మెలిక కనిపిస్తుందని..  ఓ కొత్త ప్రపంచం రాబోతూ ఉండొచ్చని అంటున్నారు. ఔరిగా నక్షత్ర వ్యవస్థ కూడా ఉండబోతుందని సైంటిస్టులు అంటుననారు. ఫ్రాన్స్‌లోని పీఎస్ఎల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఆంటోని బొక్కాలెట్టి ‘వేల కొద్దీ గ్రహ నిర్మాణాలను కనుగొన్నాం. కానీ, అవి ఎలా తయారవుతాయో అనే దానిపై తక్కువ అవగాహన మాత్రమే ఉంది’ అని అన్నారు. 

గ్రహాలు తయారవుతుంటే మనం వాటిని చిత్రీకరించడం ముఖ్యం. ఇప్పటి వరకూ ఆస్ట్రానమర్లకు కొత్త డిస్క్ ల నిర్మాణం.. వాటి మధ్య మెలికల గురించి స్పష్టమైన అవగాహన లేదని అన్నారు. వీఎల్టీ వాతావరణ పరికరంతో ఏబీ ఔరిగే ఫొటోలు తీస్తున్నామని.. దుమ్ము గురించి స్పష్టమైన ఫొటోలతో పాటు, ఆ చిన్న గ్రహం విడుదల చేస్తున్న గ్యాస్ గురించి తెలిసిందని అన్నారు. 

ఇదే పరికరంతో 2018లోనూ మరో చిన్న గ్రహం ఫొటోలు తీయగలిగారు. అది కేవలం 5.4మిలియన్ సంవత్సరాల క్రితం గ్రహంగా గుర్తించారు. ఫ్రాన్స్‌లోని ఆస్ట్రోఫిజిక్స్ ల్యాబొరేటరీ ఆఫ్ బొర్డెక్స్(ల్యాబ్)కు చెందిన ఎమ్మాన్యుయేల్ డి ఫోల్కో ఇటువంటి  ఫినామినోలు ఎలా ఉంటాయంటే.. నీళ్లలో ఉన్న పడవ కదులుతున్నట్లుగా తరంగాలు ఊగినట్లు అనిపిస్తూ ఉంటాయి. 

ఏబీ ఔరిగా అనే కొత్త గ్రహం భ్రమణం చెందుతూ చుట్టూ గ్యాస్ తో నిండి ఉంటుంది. వలయాకారంలో దుమ్ముతో నిండి ఉంది. పసుపు రంగులో ఉండి ట్విస్ట్ తో ఉంది. సూర్యుడి నుంచి నెప్యూన్ కు ఉన్నంత దూరంలోనే ఇది కూడా ఉంది. ఈ ట్విస్ట్ ద్వారానే గ్రహాల ఏర్పాటు కుదురుతుంది. 

Read: 9 వేల ఉద్యోగాలు పోయినట్లే.. ప్రకటించిన రోల్స్ రాయిస్