Viral video: అమెరికాలో ఢీ కొన్న రెండు విమానాలు.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో 2 చిన్నపాటి విమానాలు ఢీ కొని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వాట్సన్విల్లే మున్సిపల్ విమానాశ్రయంలో ఆ రెండు విమానాలు దిగుతోన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు వివరించారు. ప్రమాదం కారణంగా మరికొందరికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

Viral video: అమెరికాలో ఢీ కొన్న రెండు విమానాలు.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు

Viral video

Viral video: అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో 2 చిన్నపాటి విమానాలు ఢీ కొని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వాట్సన్విల్లే మున్సిపల్ విమానాశ్రయంలో ఆ రెండు విమానాలు దిగుతోన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు వివరించారు. ప్రమాదం కారణంగా మరికొందరికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటనపై విచారణ ప్రారంభించామని అధికారులు మీడియాకు చెప్పారు. ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో నేలపై ఎవరికీ గాయాలు కాలేదని వివరించారు.

రెండు విమానాలు కుప్పకూలిన అనంతరం కొందరు తీసిన వీడియోలు సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. విమానాశ్రయానికి దగ్గరలో ఉండే వారు ఈ వీడియోలు తీసినట్లు తెలుస్తోంది. విమాన ప్రమాదం వల్ల ఎయిర్ పోర్టులోని ఓ భవన భాగం కూడా ధ్వంసమైనట్లు వాటి ద్వారా తెలుస్తోంది. ఈ ఘటన జరగగానే సహాయక బృందాలు అక్కడకు వచ్చి చర్యలు చేపట్టాయి. మృతులు, గాయపడిన వారి వివరాలను అధికారులు కాసేపట్లో వెల్లడించే అవకాశం ఉంది.

 

China New Mission: చైనా మరో ఎత్తుగడ.. హిందూ మహాసముద్రంలో పట్టు కోసం కుయుక్తులు..