prison riot : కొట్టుకున్న ఖైదీలు.. 20 మంది మృతి..

జైల్లో ఖైదీల మధ్య నాయకత్వ వివాదం తలెత్తడంతో జరిగిన ఘర్షణలో 20 మంది ఖైదీలు మృతి చెందారు. ఈ ఘటన ఈక్వెడార్లోని క్యూన్వా నగరానికి సమీపంలోని టురి జైలులో ఆదివారం తెల్లవారు జామున ...

prison riot : కొట్టుకున్న ఖైదీలు.. 20 మంది మృతి..

Ecuador Prison Riot

prison riot : జైల్లో ఖైదీల మధ్య నాయకత్వ వివాదం తలెత్తడంతో జరిగిన ఘర్షణలో 20 మంది ఖైదీలు మృతి చెందారు. ఈ ఘటన ఈక్వెడార్లోని క్యూన్వా నగరానికి సమీపంలోని టురి జైలులో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఈ ఘర్షణ 20 మంది మృతి చెందడంతో పాటు మరో 11 మందికి గాయాలయినట్లు ఈక్వెడార్ జాతీయ పోలీసు దళ కమాండర్ జనరల్ కార్లోస్ కాబ్రెరా వెల్లడించారు. ఘటన అనంతరం జైలును, పరిసర ప్రాంతాలను పూర్తి నియంత్రణలోకి తీసుకున్నామని అక్కడి అధికారులు సోమవారం తెలిపారు. మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు సమాచారం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Nairobi prison fire : బురిండి జైలులో భారీ అగ్నిప్రమాదం.. 38 మంది ఖైదీల సజీవ దహనం

ది వోల్వ్స్ అని పిలవబడే ముఠాలోని ఖైదీల సభ్యుల మధ్య నాయకత్వ వివాదం కారణంగా ఈ ఘర్షణ తలెత్తిందని, దీంతో ఒకరిపై ఒకరు దాడిచేసుకోవటంతో 20 మంది మృతి చెందారని కార్లోస్ కాబ్రెరా తెలిపారు. అయితే బాధితుల్లో 19 మంది ఘర్షణ వల్ల మృతి చెందారని, ఒకరు రసాయన పదార్థం తీసుకోవటం వల్ల మరణించాడని వెల్లడించారు. ఇదిలా ఉంటే సెప్టెంబరు 2021లో జరిగిన ఘర్షణల నుండి ఈక్వెడార్ జైలు వ్యవస్థ అత్యవసర పరిస్థితిలో ఉంది.

Israel : జైల్లో ఉన్న సమయంలోనే ఆలూ చిప్స్ సహాయంతో..నలుగురు బిడ్డలకు తండ్రి అయిన ఖైదీ

ఆటోమేటిక్ ఆయుధాలు, గ్రెనేడ్‌లతో వాడుతూ ఖైదీల మధ్య జరిగిన ఘర్షణల్లో 118 మంది మరణించారు. దక్షిణ అమెరికా నుండి యూఎస్, ఆసియాకు కొకైన్‌ను తీసుకువచ్చే మార్గంలో ఈక్వెడార్ కీలకమైన రవాణా కేంద్రంగా ఉంది. ఇది ముఠా ఘర్షణలకు కేంద్రంగా ఉంటుంది. జైళ్లు కూడా నిత్యం రద్దీగా ఉంటాయి.