Lahore Blast : హఫీజ్ సయీద్ నివాసం సమీపంలో పేలుడు..ముగ్గురు మృతి,21మందికి గాయాలు

పాకిస్తాన్‌లోని లాహోర్‌ లోని జోహర్ టౌన్ లో బుధవారం పేలుడు ఘ‌ట‌న సంభ‌వించింది.

Lahore Blast : హఫీజ్ సయీద్ నివాసం సమీపంలో పేలుడు..ముగ్గురు మృతి,21మందికి గాయాలు

Lahore Blast (1)

Lahore Blast పాకిస్తాన్‌లోని లాహోర్‌ లోని జోహర్ టౌన్ లో బుధవారం పేలుడు ఘ‌ట‌న సంభ‌వించింది. ఉగ్రవాద సంస్థ లష్కర్ ఈ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ నివాసానికి 120 మీటర్ల దూరంలోని రెసిడెన్షియ‌ల్ ప్రాంతంలో ఈ పేలుడు జ‌రిగింది ఈ బ్లాస్ట్ జరిగింది. అయితే సయీద్ ప్రస్తుతం లాహోర్ జైల్లో ఉన్నాడు.

కాగా,పేలుడు కారణంగా స‌మీపంలో ఉన్న ఇండ్లు,వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ పేలుడు కారణంగా ముగ్గురు మరణించగా..21మంది గాయపడినట్లు లాహోర్ పోలీస్ చీఫ్ మొహ్మూద్ దోగర్ తెలిపారు. గాయపడినవారిలో ఓ పోలీస్ అధికారి సహా మహిళలు,చిన్నారులు ఉన్నారని.. గాయ‌ప‌డ్డ‌వారిని జిన్నా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. పేలుడుకు కార‌ణాలు ఏంటో ఇంకా తెలియ‌లేద‌న్నారు. సంఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

పేలుడు ఘ‌ట‌నపై నివేదిక సమర్పించాలని ఫ్రావిన్షియల్ పోలీస్ చీఫ్ ని పంజాబ్ సీఎం ఉస్మాన్ బుజ్‌దార్ ఆదేశించారు. పాకిస్తార్ ఇంటీరియర్ మంత్రి షేక్ రషీద్ కూడా ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని పంజాబ్ చీఫ్ సెక్రటరీ మరియు పోలీస్ చీఫ్ ని కోరారు. ఈ విచారణలో పంజాబ్ ప్రభుత్వానికి ఫెడరల్ ఏజెన్సీలు సహాయం చేస్తున్నట్లు ఆయన ఓ ట్వీట్ లో తెలిపారు.