US Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. దుండగుడి కాల్పుల్లో…

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు దుర్మరణం చెందారు. భద్రతాసిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో దుండగుడితో పాటు ఓ పోలీస్ కి గాయాలయ్యాయి. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

US Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. దుండగుడి కాల్పుల్లో…

Shooting

US Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు దుర్మరణం చెందారు. భద్రతాసిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో దుండగుడితో పాటు ఓ పోలీస్ కి గాయాలయ్యాయి. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పుల ఘటన పశ్చిమ మేరీల్యాండ్ లోని స్మిత్ బర్గ్ లో గురువారం మధ్యాహ్నం సమయంలో చోటు చేసుకుంది. కొలంబియా మెషీన్ తయారీ కపెనీలోకి చొరబడ్డ ఓ సాయుధుడు తుపాకీతో కాల్పులు జరిపాడు.

Texas shooting: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు.. 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృతి

ఈ ఘటనపై మేరీల్యాండ్ గవర్నర్ లారీ హొగన్ విలేకరులతో మాట్లాడుతూ.. దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపాడు. అయితే కాల్పులు జరిపిన సమయంలో కంపెనీలో ఉద్యోగులు ఎంత మంది సైట్ లో ఉన్నారనేది తెలియాల్సి ఉంది. కంపెనీ తన వెబ్‌సైట్ ప్రకారం.. 100 దేశాలలో వినియోగదారులకు కాంక్రీట్ తయారీ పరికరాలను సరఫరా చేస్తుంది. ఇదిలా ఉంటే గాయపడిన దుండగుడు, ఓ పోలీస్ అధికారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో కాల్పుల సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజుల క్రితం ఓ స్కూల్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 19మంది చిన్నారులతో సహా 21 మంది మరణించారు. ఆ ఘటన మరవక ముందే మూడు రోజుల క్రితం ఓ గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

Texas school shooting: తెలివైన పిల్ల.. రక్తాన్ని ఒంటికి పూసుకొని ప్రాణాలు దక్కించుకుంది..

తాజాగా దండగుడు జరిపిన కాల్పల్లో మరో ముగ్గురు మృతిచెందారు. వరుసగా కాల్పుల ఘటన చోటు చేసుకుంటుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో సంచరించాలంటే ఆందోళన చెందుతున్నారు. కాల్పుల ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దండగుడు కాల్పులు జరపడానికి కారణాలు ఏమిటనే విషయాలపై పోలీసులు విచారించనున్నారు. ఇదిలాఉంటే అమెరికాలో వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటన నేపథ్యంలో తుపాకీ హింసను నియంత్రించేందుకు జోబైడన్ ప్రభుత్వం చట్టాలను మరింత కఠినం చేసేలా చర్యలు తీసుకుంది. తుపాకుల కొనుగోళ్లపై ఆంక్షలు విధించింది.