Buses Collide Video: సెనెగల్ దేశంలో రెండు బస్సులు ఢీ.. 40 మంది మృతి.. 78 మందికి గాయాలు

పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ఘోర బస్సు ప్రమాదం జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 78 మంది గాయపడ్డారు. సెనెగల్ అధ్యక్షుడు మాకీ హాల్ ఈ ఘోర ప్రమాదంపై ట్వీట్ లో వివరాలు తెలిపారు. కాఫ్రిన్ ప్రాంతంలోని గ్నిబీ గ్రామంలో ఈ బస్సు ప్రమాదం చోటుచేసుకుందని అన్నారు.

Buses Collide Video: సెనెగల్ దేశంలో రెండు బస్సులు ఢీ.. 40 మంది మృతి.. 78 మందికి గాయాలు

Buses Collide Video

Buses Collide Video: పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ఘోర బస్సు ప్రమాదం జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 78 మంది గాయపడ్డారు. సెనెగల్ అధ్యక్షుడు మాకీ సాల్ ఈ ఘోర ప్రమాదంపై ట్వీట్ లో వివరాలు తెలిపారు. కాఫ్రిన్ ప్రాంతంలోని గ్నిబీ గ్రామంలో ఈ బస్సు ప్రమాదం చోటుచేసుకుందని అన్నారు.

‘‘గ్నిబీలో ప్రమాదం చోటుచేసుకుంది 40 మంది మఈతి చెందడం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు సానుభూలి తెలుపుతున్నాను. ప్రమాదంలో చాలా మందికి గాయాలయ్యాయి. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని మాకీ సాల్ పేర్కొన్నారు. నాలుగు రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నానని అన్నారు.

రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులతో త్వరలోనే సమావేశమై చర్చిస్తానని అన్నారు. ఈ ఘటనపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెయిఖ్ డియెంగ్ స్పందిస్తూ… జాతీయ రోడ్డు నంబరు 1పై ఈ బస్సు ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు.

ఓ బస్సు టైరు పంక్చర్ అయి రోడ్డుపై మరో బస్సును ఢీ కొట్టిందని తెలిపారు. 78 మందికి గాయాలయ్యాయని వివరించారు. కాగా, పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్ లో పదే పదే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అందుకు అక్కడి రోడ్ల దుస్థితి ఒక కారణమైతే, డ్రైవర్లు నిబంధనలు పాటించకుండా వాహనాలు నడుపుతుండడం మరో కారణం.

Pushpa 2 : సైలెంట్ గా మొదలుపెట్టేసిన పుష్ప 2 షూట్.. సుకుమార్ భార్య పోస్ట్ వైరల్..