Travis Scott’s : మ్యూజిక్ ఫెస్టివల్‌లో తొక్కిసలాట.. 8 మంది మృతి 300 మందికి గాయాలు

మ్యూజిక్ ఫెస్టివల్‌లో తీవ్ర విషాదం జరిగింది. అమెరికాలోని ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 300 మందికిపైగా గాయపడ్డారు.

Travis Scott’s : మ్యూజిక్ ఫెస్టివల్‌లో తొక్కిసలాట.. 8 మంది మృతి 300 మందికి గాయాలు

Travis Scott’s

Travis Scott’s : మ్యూజిక్ ఫెస్టివల్‌లో తీవ్ర విషాదం జరిగింది. అమెరికాలోని ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 300 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన టెక్సాస్‌లోని హూస్ట‌న్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

చదవండి : America Fail : చైనా సక్సెస్‌..అమెరికా ఫెయిల్‌…యూఎస్ ప్రయోగించిన మిస్సైల్‌ అట్టర్‌ఫ్లాప్‌

ట్రావిస్ స్కాట్ స్టేజిపైకి రావడం గమనించిన ప్రేక్షకులు ఒక్కసారిగా వేదికవైపు దూసుకొచ్చారు.. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందగా 11 మంది గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. మరో 300 మంది గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

చదవండి : America : కరోనా తర్వాత భారీగా ఉద్యోగాలకు రాజీనామా చేస్తోన్న అమెరికన్లు

ఈ ఫెస్టివల్ కు మొత్తం 50 వేలమంది హాజరైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో మ్యూజిక్ ఫెస్టివల్ అర్దాంతరంగా ముగిసింది. ఇక గాయపడిన వారిలో పదేళ్ల బాలుడు కూడా ఉన్నట్లు పోలీసులు వివరించారు. ట్రావిస్ స్కాట్ ను చూసి ఒక్కసారిగా స్టేజి వైపు దూసుకురావడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. అయితే ఇందులో ఏదైనా కుట్రకోణం ఉండనే అంశంపై విచారణ చేస్తున్నామని.. సీసీ కెమెరాలను పరిశీలించి పూర్తి వివరాలు తెలియచేస్తామని పేర్కొన్నారు.