Firing In school : రష్యా స్కూల్లో కాల్పులు..11 మంది మృతి

 రష్యాలోని ఓ పాఠశాలపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కజాన్ మేయర్ ఎనిమిది మంది చనిపోయారని చెబుతుంటే..రష్యా మీడియా మాత్రం 11మంది అని చెబుతోంది. ఈ కాల్పుల్లో మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు.

Firing In school : రష్యా స్కూల్లో కాల్పులు..11 మంది మృతి

Firing In School

attack on school in russia 11 people died : రష్యాలోని ఓ పాఠశాలపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కజాన్ మేయర్ ఎనిమిది మంది చనిపోయారని చెబుతుంటే..రష్యా మీడియా మాత్రం 11మంది అని చెబుతోంది. ఈ కాల్పుల్లో మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 8 మంది విద్యార్థులు..ఓ టీచర్ ఉన్నారు. స్కూల్ పై కాల్పులకు తెగబడిన దుండగులు పలువురు విద్యార్ధులను బంధీలుగా చేసుకున్నట్లుగా సమాచారం. బందీలుగా ఉన్నవారిని రక్షించేందుకు రష్యా సైన్యం రంగంలోకి దిగింది. ఇద్దరు వ్యక్తులను భద్రతా దళాలు కాల్పిచంపినట్లు వార్తలు వచ్చాయి.

రష్యాలోని కజాన్ నగరంలో స్కూల్ నెంబర్ 175 లో మంగళవారం (మే 11,2021) ఉదయం ఒక స్కూల్లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. స్కూల్లో పేలుళ్లు..కాల్పులతో విద్యార్థులు..సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ గందరగోళం మధ్య జరిగిన కాల్పుల్లో విద్యార్ధులతో పాటు కొంతమంది బలైపోయారు. ఈ భయాందోళనల మద్య తీవ్ర గందరగోళానికి గురై..పెద్ద ఎత్తున పొగ వెలువడటంతో అగ్నిప్రమాదం అనుకుని కొంతమంది స్కూల్ భవనంపై నుంచి దూకినట్లుగా సమాచారం.

దాడి జరిగినప్పుడు ఇద్దరు విద్యార్ధులు మూడో అంతస్తు కిటికీ నుంచి కిందికి దూకినట్లు ఎమర్జన్సీ ప్రతినిధులు తెలిపారు. ఎత్తు నుంచి పడిపోవడంతో ఇద్దరు మరణించారని తెలిపారు. స్కూలు నాలుగో అంతస్తులో దాడి చేసిన వ్యక్తి కూడా కొంతమందిని బందీగా చేసుకున్నాడని రష్యా వార్తా సంస్థ ఆర్‌ఐఏ వెల్లడించింది. గాయపడినవారిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు.

కాల్పులు జరుపడానికి ముందు వారు పేలుళ్లు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. పేలుడు శబ్ధాలు విన్న కొంతమంది విద్యార్థులు పాఠశాల పై అంతస్థుల నుంచి కిందికి దూకారని, వారిలో చాలా మందికి తీవ్రంగా గాయాలయ్యాయని తెలిపారు. కాగా ఈ దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.