Spider Webs: ఎక్కడ చూసినా సాలెగూడులే..వాటిలో స్పైడర్లు..

Spider Webs: ఎక్కడ చూసినా సాలెగూడులే..వాటిలో స్పైడర్లు..

Spider Webs Blanket Country Side After Floods (4)

Australia Floods : ఆస్ట్రేలియాలో జనాలకు ఇప్పుడు కొత్త చిక్కొచ్చిపడింది. ఎక్కడ చూసిన సాలెగూడులే కనిపిస్తున్నాయి. వాటినిండా సాలెపరుగులు. తెల్లటి దుప్పటి కప్పినట్లుగా సాలెగూడులు జనాలకు చికాకు తెప్పిస్తున్నాయి. రోడ్లు, పొలాలు, ఇళ్లు, మొక్కలు, చెట్లు ఇలా ఎక్కడ చూసినా సాలెగూడులు..వాటిలో సాలెపురుగులే కనిపిస్తున్నాయి. ఎటువైపు చూసినా తెల్లటి దుప్పటి కప్పినట్లుగా సాలెగూడులు కనిపిస్తున్నాయి. దీంతో జనాలకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సాలెపురుగు అంటే భయపడేవారికి ఒళ్లు జలదించిపోయేలా ఎక్కడపడితే అక్కడే కనిపిస్తు సాలెగూడుల్లో సాలెపురుగులు భయపెట్టేస్తున్నాయి.

ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో గల గిప్స్‌ల్యాండ్ ప్రాంతంలో పొలాలు, చెట్లు, ఖాళీ జాగాలు.. ఇలా ఎక్కడ చూసినా తెల్లటి సాలిగూళ్లు దుప్పటిలా పరుచుకున్నాయి. ఇటీవల ఈ ఏరియాలో భారీగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీటిమయంగా మారిపోయాయి. ఈక్రమంలో లోతట్టు ప్రాంతాలనుంచి సాలేపురుగులు నీటిని తప్పించుకునేందుకు ఎత్తుగా ఉండే ప్రాంతాలకు ఎగబాకి వచ్చేస్తూ ఆ యా ప్రాంతాల్లో గూడులు అల్లేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. సాలెపురుగులతో గిప్స్ ల్యాండ్ ప్రాంత వాసులు నానా తిప్పలు పడుతున్నారు.

కానీ తెల్లటి సాలెపురుగులతో ఎటువంటి ప్రమాదం ఉండదనీ..భయపడవద్దని నిపుణులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని నీరు యధాస్థితికి వెళ్లిపోయాక.. పరిస్థితి చక్కబడ్డాక సాలెగూళ్లు ఎక్కడవక్కడకు వెళ్లిపోతాయని అంటున్నారు. కాగా..గిప్స్ ల్యాండ్ లో ఎక్కడపడితే అక్కడ పాకుతున్న సాలెపురుగుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.