Covid in Cruise Ship : క్రూయిజ్ నౌకలో 800 మందికి కరోనా.. అప్రమత్తమైన ప్రభుత్వం

ఓ నౌకలో ప్రయాణించే వందలాదిమంది ప్రయాణీకుల్లో 800లమంది కోవిడ్ బారినపడ్డారు. దీంతో నౌక అంతా ఒక్కసారిగా కల్లోలం ఏర్పడింది. దీంతో నౌకలోనే కోవిడ్ బాధితులకు క్వారంటైన్ ఏర్పాటు చేశారు. బాధితులందనిరి ఐసోలేషన్ లో ఉంచారు.

Covid in Cruise Ship : క్రూయిజ్ నౌకలో 800 మందికి కరోనా.. అప్రమత్తమైన ప్రభుత్వం

800 test positive In majestic princess cruise ship sydney

Covid in Cruise Ship : కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం హడలిపోయింది.  ఎంతోమందిని పొట్టనపెట్టుకున్న కరోనా మరోసారి దాని ప్రతాపాన్ని చూపిస్తోంది ఆ వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో. చైనాలో నిన్న ఒక్కరోజే 10వేలకుపైగా కేసులు నమోదు కావటంతో అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. కరోనాకు కారణమైన చైనా మరోసారి ఆ మహమ్మారితో పోరాడుతూంటే ప్రపంచదేశాలన్ని దీన్నుంచి కోలుకున్నాయి. కొన్ని కొన్ని దేశాల్లో నామమాత్రపు కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయి.

ఈక్రమంలో ఆస్ట్రేలియా మాత్రం మరోసారి కరోనా మరోసారి కలకలం రేపింది. ఓ నౌకలో ప్రయాణించే వందలాదిమంది ప్రయాణీకుల్లో 800లమంది కోవిడ్ బారినపడ్డారు. దీంతో నౌక అంతా ఒక్కసారిగా కల్లోలం ఏర్పడింది. దీంతో నౌకలోనే కోవిడ్ బాధితులకు క్వారంటైన్ ఏర్పాటు చేశారు. బాధితులందనిరి ఐసోలేషన్ లో ఉంచారు. వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేశారు.

China Covid- 19 : చైనాలో ఒక్కరోజే 10,729 కోవిడ్ కేసులు నమోదు .. లాక్ డౌన్ ఆంక్షల్లో 10 లక్షలమంది

సిడ్నీ తీరంలోని క్రూయిజ్ నౌకలో వందలాది మంది ప్రయాణికులు కరోనా వైరస్ బారినపడటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ప్రజలు కోవిడ్-19 నిబంధనలు పాటించాలని ఆస్ట్రేలియా హోం మంత్రిత్వ శాఖ శనివారం (నవంబర్ 12,2022) విజ్ఞ‌ప్తి చేసింది. న్యూసౌత్ వేల్స్ రాజధాని సిడ్నీ తీరంలో నిలిపి ఉన్న కార్నీవాల్ ఆస్ట్రేలియా మెజిస్టిక్ ప్రినెస్స్ క్రూయిజ్ నౌకలోని 800 మంది ప్రయాణికులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు దృవీకరించారు. దీంతో వ్యాప్తి తీవ్రతను టైర్ 3‌గా‌ న్యూసౌత్ వేల్స్ ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. టైర్-3 రేటింగ్ అత్యధిక వ్యాప్తిని సూచిస్తుంది.

నౌకలో ఇన్ని వందలమంది కోవిడ్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన 2020లో రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌‌లో కోవిడ్-19 కల్లోలాన్ని గుర్తుచేస్తోంది. అప్పట్లో రూబీ క్రూయిజ్ నౌకలో ప్రయాణించిన 914 మంది కరోనా వైరస్ బారినపడగా.. 28 మంది ప్రాణాలు కోల్పోయారు. రూబీ ప్రిన్సెస్ ఘటన నేపథ్యంలో అధికారులు రెగ్యులర్ ప్రోటోకాల్‌ రూపొందించారని, మెజెస్టిక్ ప్రిన్సెస్ నుంచి ప్రయాణీకులను కేసు వారీగా ఎలా తీసుకురావాలనే న్యూ సౌత్ వేల్స్ ఆరోగ్య యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని హోం మంత్రి క్లేర్ ఓనీల్ చెప్పారు. రాష్ట్ర యంత్రాంగానికి కేంద్ర సరిహద్దు దళం అధికారి అనుబంధంగా బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.

న్యూ సౌత్ వేల్స్ ఆరోగ్య విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. గ్లోబల్ లీజర్ కంపెనీ కార్నివాల్ కార్పొరేషన్ అండ్ పీఎల్‌సీలో భాగమైన కార్నివాల్ ఆస్ట్రేలియా.. వైరస్ నిర్దారణ అయిన ప్రయాణీకులు లోపల ఐసోలేషన్‌లో ఉన్నారని..వారి ఆరోగ్యం గురించి ఎటువంటి ఆందోళనపడవనసరం లేదని ఎందుకంటే వైద్య సిబ్బంది శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపింది. ప్రయాణీకులు, సిబ్బంది ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి క్రూయిజ్ షిప్ సిబ్బందితో కలిసి పనిచేస్తున్నారని ప్రభుత్వం తెలిపింది.