Australia rabbits : ఆ దేశ ఆర్థిక వ్యవస్థనే కుదేలయ్యేలా చేసిన ‘కుందేళ్లు’..!
కుందేళ్లు. అందంగా..అంతకంటే అమాయకంగా ఉండే సాధుజీవులు.. అంత అమాయకంగా అందంగా ఉండే కుందేళ్లు ఒకానొక దేశాన్ని గజగజ వణికించాయ్. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయ్..!

Australia rabbits shook Australia’s rural economy : కుందేళ్లు. అందంగా..అంతకంటే అమాయకంగా ఉండే సాధుజీవులు.. అంత అమాయకంగా అందంగా ఉండే కుందేళ్లు ఒకానొక టైంలో.. ఒకానొక దేశాన్ని గజగజ వణికించాయ్. గడగడలాడించాయ్. దండయాత్ర.. ఇది.. కుందేళ్ల దండయాత్ర అంటూ.. దయాగాడి డైలాగ్‌ని మించి.. దంచి కొట్టాయ్. కుందేళ్ల దెబ్బకు.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థే.. కుదేలైపోయింది. అవి.. మామూలు కుందేళ్లే అయినా.. ఇది మాత్రం మామూలు విషయం కాదు.
కుందేళ్లు ఎంత డేంజరో తెలుసుకోవాలంటే.. హిస్టరీలో మనం కొన్ని పేజీలు వెనక్కి వెళ్లాలి. అవి.. 20వ శతాబ్దం మధ్యకాలం నాటి రోజులు. ఆస్ట్రేలియాలో.. కుందేళ్ల దండయాత్ర సాగుతున్న సమయం. అప్పట్లో.. కొన్ని వందల కోట్ల సంఖ్యలో ఉన్న కుందేళ్లు.. ఆ దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయ్. పంట చేలను నాశనం చేసి.. గడ్డిపోచ కూడా కనిపించకుండా తినేసేవి. వాటి ధాటికి.. మొలవడానికి గడ్డి కూడా గజగజ వణికిపోయేది. దాంతో.. పశుపోషణపై తీవ్ర ప్రభావం పడి.. తీరని భారంగా మారింది. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడింది. దీనిని ఎదుర్కొనేందుకు.. కుందేళ్లపై యుద్ధం ప్రకటించింది ఆనాటి ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఉరుగ్వే నుంచి తీసుకొచ్చిన ఓ వైరస్ సాయంతో.. క్రైసిస్‌ని ఖతం చేసే ప్రయత్నం చేశారు.
Also read : Ganga Dolphin : గంగా డాల్ఫిన్స్ కోసం..బిహార్‌లో నిలిచిపోయిన గంగా రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పనులు
ఈ విపత్తుకు ముందు ఏం జరిగిందంటే.. 19వ శతాబ్దం మధ్య కాలంలో.. యూరప్ నుంచి ఆస్ట్రేలియాకు కుందేళ్లను తీసుకొచ్చారు. అప్పట్లో.. ఇతర జంతువులను వేటాడేందుకు.. ఈ కుందేళ్లను ఎరగా వాడేవారు. అలా తెచ్చిన కుందేళ్లు.. మందలు మందలుగా పెరిగిపోయి.. దేశానికే సవాల్ విసిరే స్థాయికి చేరేందుకు ఎంతో కాలం పట్టలేదు. కొత్త వాతావరణానికి.. పరాయి జీవజాతులను పరిచయం చేస్తే.. ఏం జరుగుతుందో.. అదెలాంటి పరిణామాలకు దారితీస్తుందో.. చెప్పడానికి ఆస్ట్రేలియానే బిగ్ ఎగ్జాంపుల్.
1930 నాటికి.. ఆస్ట్రేలియాని గ్రామీణ ప్రాంతాల్లో కుందేళ్ల సమస్య తీవ్రమైంది. చాలా మంది రైతులు.. వాటిని వేటాడి చంపేవారు. పంటలను కాపాడుకునేందుకు.. వాటి చుట్టూ కంచెలు వేసేవారు. కాపలా ఉండేవారు. అయినా.. వందల్లో ఉండే కుందేళ్ల బెడద తప్పకపోయేది. రెండే ప్రపంచ యుద్ధం నాటికి ఈ సమస్య మరింత పెరిగింది. యుద్ధంలో పోరాడేందుకు చాలా మంది మగవాళ్లు వెళ్లాల్సి రావడంతో.. కుందేళ్లను వేటాడే వాళ్లు తగ్గిపోయారు. యుద్ధం జరిగినంత కాలం.. కుందేళ్లను ఎవరూ నియంత్రించలేకపోయారు. దీంతో.. అవి మరింత రెచ్చిపోయాయ్. భూములన్నీ నాశనమయ్యాయ్. పంటలు వేస్తే.. ఆ మొలకలను వేళఅలతో సహా తినేసేవి. భూమి మీద ఆకులు, అలములు, గడ్డి అనే తేడా లేకుండా.. అన్నింటిని స్వాహా చేసేసేవి. దీంతో.. పశుపోషణ కష్టమై.. రైతులు తీవ్రంగా నష్టపోయారు.
Also read : Madhya pradesh : భోపాల్‌లో రైల్వే కూలీల కోసం ఏసీ రెస్ట్ రూమ్స్
ఇక.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మనుగడకు ప్రమాదకరంగా మారిన కుందేళ్లను.. ఎక్కడికక్కడే చంపేయాలని ప్రజలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. దాంతో.. రైతులు గడ్డి మీద విషం చల్లి వాటిని చంపేవారు. అవి ఉండే బొరియలను యంత్రాలతో ధ్వంసం చేసేవారు. వాటిలోకి విషవాయువులను పంపేవారు. ఇన్ని చేసినా.. సమస్య పరిష్కారం కాకపోవడంతో.. ఉరుగ్వే నుంచి మిక్సోమా అనే ప్రమాదకర వైరస్‌ను తీసుకొచ్చారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ సోకిన కుందేళ్లకు.. చర్మం మీద గడ్డలు ఏర్పడి.. దవడలు ఉబ్బి.. మేత తినలేని పరిస్థితి వస్తుంది. తర్వాత అవయవాలు దెబ్బతింటాయ్. 1950లో.. ఈ వైరస్‌ను ఆస్ట్రేలియా వ్యాప్తంగా వదిలారు. ఇక్కడ సక్సెస్ అవడంతో.. ఇదే విధానాన్ని బ్రిటన్, ఐర్లాండ్, ఫ్రాన్స్, యూరప్ కూడా ఫాలో అయ్యాయ్.
కొన్ని కోట్ల కుందేళ్లు.. ఉరుగ్వే నుంచి తెచ్చిన వైరస్ బారిన పడ్డాయ్. వాటిలో.. దాదాపు 90 శాతం చనిపోయాయ్. దాంతో.. భూములు క్రమంగా కోలుకున్నాయ్. దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కాస్త కుదుటపడింది. అయితే.. కొన్నాళ్లకు బతికున్న కుందేళ్లలో.. ఆ వైరస్‌ను తట్టుకునే శక్తి కూడా పెరిగింది. దీంతో.. 1990ల్లో.. మరో కొత్త వైరస్ ప్రయోగించారు. అది మొదట్లో ఫలితాలనిచ్చినా.. తర్వాత దాన్ని కూడా కుందేళ్లు తట్టుకున్నాయ్. దాంతో.. ఇప్పటికీ.. ఆస్ట్రేలియాలో కుందేళ్లపై పోరాటం కొనసాగుతోంది. ఇప్పుడు కూడా వాటిని నిర్లక్ష్యం చేస్తే.. భవిష్యత్తులో.. మళ్లీ గత పరిస్థితులే రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని.. ఆస్ట్రేలియాలోని గ్రామీణ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
1McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్‌లో చచ్చిన బల్లి: అవుట్లెట్ సీజ్
2VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
3Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
4CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
5TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
6Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
7Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
8Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
9Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
10RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ