ఆస్ట్రేలియాలో గుట్టలుగా ఎలుకలు..సాలీడులు..తిండీ, నిద్రలేక తిప్పలు పడుతున్న జనాలు

ఆస్ట్రేలియాలో గుట్టలుగా ఎలుకలు..సాలీడులు..తిండీ, నిద్రలేక తిప్పలు పడుతున్న జనాలు

Mouse, Spiders Problem In Australia

Mouse, spiders problem in Australia: ఓ పక్క కరోనా మహమ్మారి, మరో పక్క వరదలు..ఇంకో పక్క విపత్కర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది ఆస్ట్రేలియా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్ట్రేలియా పరిస్థితి ఎలా ఉందీ అంటే..గోరు చుట్టు మీద రోకలి పోటులా ఉంది. కారణం ఏమంటే..కరోనాతోనే పోరాడుతూనే ఉంది. మరోపక్క వర్షాలు, వరదలతో ఇబ్బందులు పెడుతున్నాయి. దీనికి తోడు ఆస్ట్రేలియాలో ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా ఎలుకలు వీర విహారం చేస్తున్నాయి. అలాగే ఎక్కడ చూసినా సాలీడులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ప్రజలకు మనశ్శాంతి లేకుండాపోతోంది.

1

ఆస్ట్రేలియాలో ఒక్కసారిగా ఎలుక సంఖ్య పెరిగిపోయింది. ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా ఎలుకలు వీరవిహానం చేస్తున్నాయి. ప్రతీదాన్ని క్షణాల్లో స్వాహా చేసేస్తున్నాయి. దీంతో రెస్టారెంట్లు, షాప్స్ యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. సరుకులన్నీ ఎలుకలు స్వాహా చేసేస్తుండటంతో వారి వారి వ్యాపారాలు మూసేసుకోవాల్సి వస్తోంది.

4

ఎలుకలను పట్టుకునే పనిలో పనిలో ఎవరికి వారు బిజీ బిజీ అయిపోయారు. ఈ ఎలుకలు పెద్ద తలనొప్పిలా తయారయ్యాయి. తిండి తిననివ్వవు..నిద్ర పోనివ్వవు. రెస్టారెంట్లు, షాపుల్లోనే కాదు ఇళ్లల్లో కూడా ఎలుకల సంఖ్య బాగా పెరిగిపోయింది.

2

ఆస్ట్రేలియాలోని తూర్పు రాష్ట్రాల్లో మిలియన్ల కొద్దీ ఎలుకలు రోడ్డు మీద యదేచ్ఛంగా తిరిగేస్తున్నాయి. కాట్ వాక్ చేస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎటువంటి రోగాలు వస్తో ఈ ఎలుకల వల్ల అని భయపడిపోతున్నారు.

5

మరోవైపు న్యూ సౌత్ వేల్స్‌లోని రైతులు తమ భూమిని, పంటను ధ్వసం చేస్తున్న ఎలుకలను, ఇళ్లలో వీర విహారం చేస్తున్న ఎలుకల వీడియో లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు న్యూ సౌత్ వేల్స్ ఆసుపత్రులల్లో ముగ్గురు వ్యక్తులను ఎలుకలు కరిచాయి.

7

అంతేకాదు ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఎలుకలే దర్శనమిస్తున్నాయి. అన్ని ఆహార పదార్ధాలను తినేస్తున్నాయి. వాహనాలను కూడా నాశనం చేస్తున్నాయని వాపోతున్నారు జనాలు. దీంతో అధికారులతో పాటు.. ప్రజలు కూడా తమ పనులన్నీ పక్కన పెట్టేసి.. ఎలుకలను వేటలో పడ్డారు. ఈ క్రమంలో ఎలుకలు విపరీతంగా పెరిగిపోవటంతో ఎక్కడ ప్లేగు వ్యాధి వస్తుందోనని అధికారులు హడలిపోతున్నారు. ప్రజలు కూడా అదే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

3

మరోవైపు సిడ్నీ వంటి ప్రాంతాల్లో ఎలుకలతో పాటు .. ప్రమాదకరమైన అరక్నిడ్ (ఫన్నెల్ వెబ్) సాలీళ్లు కూడా ఇళ్లల్లో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి. దీంతో సిడ్నీ వాసులు నానా పాట్లు పడుతున్నాయి. అవి కరిస్తే.. ప్రాణాలు పోతాయని భయపడుతున్నారు. అరక్నిడ్ సాలీళ్లు కరిస్తే మరణించినవారు కూడా ఉన్నారని జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

8

దీంతో ప్రజలు మరింత భయపడిపోతున్నారు. వాటినుంచి రక్షించుకోవటానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో ఆస్ట్రేలియన్ రెప్టైల్ పార్క్ (సరీసృపాల పార్క్)ఈ సాలీడులను పట్టి తమకు అందించాలని కోరుతోంది. వాటి నుంచి యాంటీ వీనమ్ తయారుచేస్తామని చెబుతోంది.