పావురం ప్రయాణం 15 వేల కిలోమీటర్లు, చంపేయాలని చూస్తున్న ఆస్ట్రేలియా

పావురం ప్రయాణం 15 వేల కిలోమీటర్లు, చంపేయాలని చూస్తున్న ఆస్ట్రేలియా

Australia to kill US pigeon : ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 15 వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన పావురాన్ని చంపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. దీనికంతటికి కారణం..అమెరికా నుంచి రావడమే. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కఠినంగా క్వారంటైన్ ఆంక్షలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పావురం చొరబడడం ప్రమాదకరంగా భావిస్తున్నారని సమాచారం. పౌల్ట్రీ పరిశ్రమకు ఆ పావురంతో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తోంది. ఆస్ట్రేలియా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పావురాన్ని ఇంకా పట్టుకోలేదని సమాచారం. దీని ద్వారా ప్రమాదం ఉందని, అణిచివేయాలని అగ్రికల్చర్, వాటర్, పర్యావరణ శాఖ వెల్లడిస్తోంది. డిసెంబర్ 26వ తేదీన మెల్ బోర్న్ లోని ఓ వ్యక్తి ఇంట్లో దొరికన పావురం..ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ పావురం ఒరేగాన్ రాష్ట్రానికి చెందిన రేసు పావురంగా గుర్తించారు.

గత సంవత్సరం అక్టోబర్ లో ఈ పక్షి అదృశ్యమైనట్లు భావిస్తున్నారు అలబామా నుంచి మెల్ బోర్న్ వరకు సుమారు 15 వేల కిలోమీటర్లు ప్రయాణించిందని, ఫసిపిక్ మహా సముద్రం మీదుగా ఓ కార్గో షిప్ ద్వారా పావురం వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. పావురం కాలికి ఓ ట్యాగ్ ఉంది. దానికి జో అని పేరు కూడా ఉన్నదట.