బెస్ట్ ఫోటో : జత చేరి..హగ్ చేసుకున్న‘వితంతు పెంగ్విన్ల’ జంట..

బెస్ట్ ఫోటో : జత చేరి..హగ్ చేసుకున్న‘వితంతు పెంగ్విన్ల’ జంట..

Australia two Widowed Penguins hugging  : ఆస్ట్రేలియాలో రెండు ‘వితంతు పెంగ్విన్లు’ ఒక దగ్గర చేరి..నీ కోసం నేను..నా కోసం నువ్వు అన్నట్లుగా హగ్ చేసుకున్న ఫోటో చూసినవారందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. ఎంతగానో అలరిస్తోంది. ఓ పెంగ్విన్ మరో పెంగ్విన్ ను చేయి చాచి..స్వాంతన పొందుతున్న దృశ్యం ఎంతగానో అలరిస్తోంది.

కొన్ని రోజుల్లో 2020 సంవత్సరం ముగియనుంది. ఈ క్రమంలో ఈ ‘‘వింతంతు పెంగ్విన్లు’ జంటను టోబియాస్ బామ్‌గార్ట్నర్ అనే జర్మన్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఓషియోనోగ్రాఫిక్ మ్యాగజైన్ అందించే ఓషియన్ ఫొటోగ్రాఫ్ అవార్డుకు ఈ వితంతు పెంగ్విన్ల జంట బెస్ట్  ఫొటో గా ఎంపిక కావటం విశేషం.

కాగా..పెంగిన్లు తమ జీవిత కాలంలో ఒకే ఒక్క భాగస్వామిని కలిగి ఉంటాయి. ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లోనైనా జంటలో ఒక పెంగ్విన్ ప్రాణాలు కోల్పోతే..ఇక మిగిలిన పెంగ్విన్ జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతుంది. మరో పెంగ్విన్ తో జత కట్టదు. కానీ కొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రానున్న తరుణంలో ఈ ‘వితంతు పెంగిన్ల’జంట జనాలకు ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈ మధ్యనే ఆ రెండు పెంగ్విన్లు తమ జీవిత భాగస్వామిని కోల్పోయాయి. ఆ తరువాత ఈ రెండూ ఓ చోట జత చేరాయి. నీకు నేను నాకు నువ్వు అన్నట్లుగా కలిసి ఉన్న ఆ పెంగ్విన్ల జంట ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఈ ఫోటో గురించి ఫోటో గ్రాఫర్ టోబియాస్ బామ్‌గార్ట్నర్ మాట్లాడుతూ ‘‘ఈ రెండు పెంగ్విన్లు ఈమధ్యనే తమ భాగస్వాములను కోల్పోయాయి. ఆ తరువాత ఈ రెండూ ఒకచోట చేరాయని తెలిపారు.

తన అద్భుతమైన ఫోటోతో బామ్‌గార్ట్నర్.. ఓషియోనోగ్రాఫిక్ మ్యాగజైన్ అందించే కమ్యూనిటీ చాయిస్ అవార్డు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా బామ్‌గార్ట్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో…ఈ మధ్య ఒక వాలంటీర్ తనను కలసి…ఈ ఫోటో కనిపిస్తున్న ఆడ వైట్ పెంగ్విన్ ఇటీవలే తన భాగస్వామిని కోల్పోయిందని..అలాగే దాని పక్కనున్న పెంగ్విన్ కూడా తన భాగస్వామిని కోల్పోయిందని..ఆ తరువాత ఆ రెండు పెంగ్విన్లు కలసి ఒకచోట గంటల తరబడి ఉంటున్నాయని తెలిపారు.

ఫొటోగ్రాఫర్ టోబియాస్ బామ్‌గార్ట్నర్ ఈ ఫొటోను తీసేందుకు మూడు రాత్రులు ఎదురుచూసి, చివరికి అద్భుతమైన దృశ్యాన్ని ప్రపంచం కంటిలో పడేలా దాన్ని అందించారు.