Pat Cummins Sixer : ఇదేందయ్యా ఇది.. ఏడా సూడలే.. భారీ సిక్సర్ బాదిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్

శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్ భారీ సిక్సర్ కొట్టాడు. ఆ సిక్సర్ అందరిని విస్మయానికి గురి చేసింది. బంతి ఎక్కడ పడిందో తెలుసా..

Pat Cummins Sixer : ఇదేందయ్యా ఇది.. ఏడా సూడలే.. భారీ సిక్సర్ బాదిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్

Pat Cummins

Pat Cummins Sixer : శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్ భారీ సిక్సర్ కొట్టాడు. ఆ సిక్సర్ అందరిని విస్మయానికి గురి చేసింది. ఫీల్డ్ లోని ఆటగాళ్లే కాదు స్టేడియంలోని అభిమానులు సైతం నోరెళ్లబెట్టారు. వార్నీ.. ఇదేం బాదుడు అని అవాక్కయ్యారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కమిన్స్ బంతిని ఎంత బలంగా బాదాడంటే.. బంతి ఏకంగా స్టేడియం బయట ఉన్న రోడ్డుపై పడింది. కమిన్స్ కొట్టిన షాట్ కు ప్రేక్షకులు సహా అంతా విస్తుపోయారు. గతంలో ఐపీఎల్ లో కమిన్స్ కొన్ని అద్భుత ఇన్నింగ్స్ లు ఆడాడు. ఈ ఏడాది ముంబైపై ఏకంగా 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి వావ్ అనిపించాడు.

Jasprit Bumrah: భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ఫాస్ట్ బౌల‌ర్‌కి 35 ఏళ్ళ త‌ర్వాత తొలిసారి ఛాన్స్‌..

గాలే వేదికగా తొలి టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్ లో 212 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 69 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ ఖవాజా, కెమరూన్ గ్రీన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఖవాజా 130 బంతుల్లో 71 పరుగులు చేశాడు.

Arjun Tendulkar: ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్‌తో అర్జున్ టెండూల్కర్ డిన్నర్

గ్రీన్ 109 బంతుల్లో 77 పరుగులు చేశాడు. అలెక్స్ క్యారీ 47 బంతుల్లో 45 పరుగులతో రాణించాడు. ప్యాట్ కమిన్స్ 16 బంతుల్లో 26 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. కమిన్స్ మూడు సిక్సర్లు బాదాడు. అందులో ఓ సిక్సర్ అందరిని ఆశ్చర్యపరిచింది. లంక బౌలర్ జెఫ్రీ వాండర్ సే బౌలింగ్ లో కమిన్స్ ఈ సిక్స్ కొట్టాడు.