Snake Inside Toilet : బాబోయ్.. టాయ్‌లెట్‌లో భారీ సర్పం, భయపడిపోయిన కుటుంబం

ఇంటి టాయ్ లెట్ లోకి పాము దూరింది. టాయ్ లెట్ నుంచి బుస్ బుస్ మనే శబ్దాలు వస్తున్నాయి. దీంతో కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. ఎక్కడి నుంచి సౌండ్ వస్తోంది, ఏమిటా సౌండ్ అని తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో టాయ్ లెట్ నుంచి సౌండ్ వస్తున్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి చూడగా పాము కనిపించింది.

Snake Inside Toilet : ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి షాకింగ్ అనుభవం ఎదురైంది. క్వీన్స్ ల్యాండ్ లోని హెర్వీ బేలో ఉన్న ఆ వ్యక్తి ఇంటి టాయ్ లెట్ లోకి పాము దూరింది. టాయ్ లెట్ నుంచి బుస్ బుస్ మనే శబ్దాలు వస్తున్నాయి. దీంతో కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. ఎక్కడి నుంచి సౌండ్ వస్తోంది, ఏమిటా సౌండ్ అని తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో టాయ్ లెట్ నుంచి సౌండ్ వస్తున్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి చూడగా పాము కనిపించింది.

అంతే, వారి గుండె జారిపోయింది. భయంతో పరుగులు తీశారు. వామ్మో పాము అంటూ హడలిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్ కు ఫోన్ చేశారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్.. టాయ్ లెట్ లో ఉండిపోయిన పాముని పట్టుకుంది. తర్వాత దాన్ని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టింది. కాగా, ఆ పాము 4 అడుగులు ఉంది. అదో కామన్ ట్రీ స్నేక్. డెండ్రాలాఫిస్ పంక్టులాటా అని పిలవబడే ఈ పాము విషపూరితం కాదని తేలింది. దాని వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. దీంతో ఆ కుటుంబం రిలాక్స్ అయ్యింది. మహిళా స్నేక్ క్యాచర్ టాయిలెట్ లోకి వెళ్లి పాముని పట్టుకున్న దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము..

టాయ్ లెట్ లోకి వెళ్లిన మహిళా స్నేక్ క్యాచర్.. అక్కడ పాముని చూసి నవ్వింది. టాయ్ లెట్ పేపర్ రోల్ లో చిక్కుకున్న పాముని కాపాడింది. దాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉందని చెప్పింది. గార్జియస్ గా ఉందంది. ఈ జాతి పాములు విషపూరితం కావంది. ఇవి మనుషులకు ఎలాంటి హాని తలబెట్టవంది. భయం, బెరుకు లేకుండా ఆ పాముని పట్టుకున్న స్నేక్ క్యాచర్.. ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చింది. ఆ పాముని బ్యాగులో బంధించిన ఆమె.. అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఓ చెట్టు మీద వదిలేసింది. ఇదంతా వీడియోలో రికార్డ్ అయ్యింది.

Also Read..Snake Dies After boy Bites: కాటేసిందన్న కోపంతో పామును కొరికి చంపిన బాలుడు .. ఆ తరువాత ఏం జరిగిదంటే..

టాయ్ లెట్ లో ఊహించని అతిథిని చూసి అంతా షాక్ కి గుయ్యారు. అసలా పాము టాయ్ లెట్ లోకి ఎలా దూరింది? అని ఆలోచిస్తున్నారు. కాగా.. ఆస్ట్రేలియాలో వేసవి కాలం వచ్చిందంటే పాముల బెడద పెరిగిపోతుందట. ఎండ వేడి తట్టుకోలేక అవి ఇళ్లలోకి దూరిపోతుంటాయి. వేడిగా ఉన్నప్పుడు గోడ పగుళ్లు, రిఫ్రిజిరేటర్ కింద, గ్రిల్ కింద లేదా ఎయిర్ కండీషనర్ వెనుక వంటి చల్లని ప్రదేశాలను వెతుకుతాయి. అందుకే.. బాత్రూమ్ లేదా టాయ్ లెట్‌లోకి వెళ్లే ముందు తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోవాలంటున్నారు. లేదంటే అనుకోని సమస్యల్లో పడాల్సి వస్తుందంటున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

 

ట్రెండింగ్ వార్తలు