Heart Tribute With Sheep: గొర్రెలతో ‘గుండె’ను నిలిపి రైతన్న నివాళి

గొర్రెలతో ‘గుండె’ను నిలిపి తన అత్తకు ‘హృదయ’పూర్వక నివాళి అర్పించాడు ఓ రైతు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Heart Tribute With Sheep: గొర్రెలతో ‘గుండె’ను నిలిపి రైతన్న నివాళి

Australian Farmer Heart Tribute With Sheep (1)

australian farmer Heart Tribute With Sheep : ప్రేమాభిమానాలు ఉండాలే గానీ..వాటిని వ్యక్తం చేయటానికి ఎంత దూరాన ఉన్నా అవి ఆత్మీయులకు చేరిపోతాయి. మాటలకు అందని భావాలను ‘చిత్రాల్లో’ చూపటం అనేది ఓ అద్భుత ఆలోచన. అటువంటి ఓఅద్భుతాన్ని మూగ జీవాలతో ఆవిష్కరించి తన మేనత్తకు ‘హృదయ’పూర్వక నివాళి అందించాడు ఓ రైతు. మూగ జీవాలైన ‘గొర్రెలతో గుండె’ను నిర్మించాడు. ఆ చిత్రంతో తన మేనత్తకు ‘హృదయ పూర్వక నివాళి’ అర్నించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఆ హృదయ’ నివాళి అర్పించిన రైతు ప్రేమాభిమానాల గురించి..

కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఎంతో మంది తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు దూరంగా గడపాల్సి వచ్చింది. మరెంతో మంది తమవాళ్ల అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేకపోయారు. అటువంటి పరిస్థితే వచ్చింది ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన రైతు బెన్ జాక్సన్‌ కు. తన ఆంటీకి చనిపోయినా వెళ్లలేకపోయాడు. కడసారిగా కళ్లారా చూసుకోలేకపోయాడు. అంతిమ వీడ్కోలు చెప్పలేకపోయాడు. అందుకోసం తన అత్తకు తన ‘గొర్రెలతో గుండె’ను నిర్మించి నివాళి అర్పించాడు.

క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన డెబ్బీ బెన్ జాక్సన్ కు అత్త అవుతుంది. ఆమె గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతూ కన్నుమూశారు. బ్రిస్బేన్‌లో జరిగిన ఆమె అంత్యక్రియల్లో పాల్గొనాలంటే బెన్ జాక్సన్.. తాను ఉండే ప్రాంతం నుంచి 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. కానీ..కరోనా లాక్‌డౌన్ వల్ల ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో వెళ్లలేకపోయాడు బెన్.

దీంతో ఆంటీపై తనకు ఉన్న ప్రేమకు గుర్తుగా పైలోకాల్లో ఉన్న తన అత్తకు తన గొర్రెలతో గుండె ఆకారాన్ని క్రియేట్ చేసి నివాళి అర్పించాడు. ఒక పొలంలో హృదయం ఆకారాన్ని గీసి, ఆ ఆకారంలో తన గొర్రెలకు ఆహారం వేసి..గొర్రెలను వదిలాడు బెన్. అలాక పలుమార్లు ప్రయత్నించిన తర్వాత గొర్రెలు అలా ఆ హార్ట్ సర్కిల్ లోకి వెళ్లాయి. అలా వెళ్లిన గొర్రె హృదయాకారం గా మారాయి. దీన్నంతా బెన్ డ్రోన్ తో షూట్ చేసి..తన ఆంటీకి ఇష్టమైన పాటను జతచేసి..సోషల్ మీడియాలో పెట్టారు. సోమవారం తన ఆంటీ అంత్యక్రియలకు ముందు ఈ వీడియోను తన బంధువులతో షేర్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా బెన్ మాట్లాడుతూ..”నేను మా ఆంటీ అంత్యక్రియలకు వెళ్లలేకపోయాను. దీంతో ఏం చేయాలో నాకు తెలియలేదు. అందుకే ఈ వీడియో ద్వారా ఆమెకు నివాళి అర్పించాలనుకుని ఇలా చేశాను” అని తెలిపాడు. ఇంకా తన ఆంటీ గురించిబెన్ మాట్లాడుతూ..ఆంటీకి అందరితోను కలిసి ఉండటమంటే చాలా ఇష్టపడేవారు.ఇతరులతో తన ఆలోచనలను, భావాలను పంచుకోవటానికి ఆమె చాలా ఇష్టపడేవారు అని బెన్ జాక్సన్ తెలిపాడు. ఈ వీడియోను చూసి ఎంతో మంది సంతోషిస్తున్నారని, తన ఆంటీ కూడా పైలోకంలో ఉండి సంతోషపడుతుంటారని ఆశాభావం వ్యక్తం చేశాడు బెన్ జాన్సన్.

అది చూసిన నెటిజన్లు మనసుండాలే గానీ మార్గం ఉండకపోదు అనేలా కామెంట్స్ పెట్టారు. ఈ వీడియోను ఆస్ట్రేలియా టీవీ చానెళ్లు కూడా ప్రసారం చేశాయి.