Australia Bans TikTok: టిక్‌టాక్‌ను బ్యాన్ చేసిన ఆస్ట్రేలియా.. కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లోనే

చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. భారత్ సహా పలు దేశాలు ఈ యాప్‌ను నిషేధిస్తూ వస్తున్నాయి.

Australia Bans TikTok: టిక్‌టాక్‌ను బ్యాన్ చేసిన ఆస్ట్రేలియా.. కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లోనే

Australia Bans TikTok

Australia Bans TikTok: చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. భారత్ సహా పలు దేశాలు ఈ యాప్‌ను నిషేధిస్తూ వస్తున్నాయి. ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఉద్యోగులకు ప్రభుత్వం అందించే ల్యాప్ టాప్‌లు, స్మార్ట్ ఫోన్లలో టిక్‌టాక్ యాప్ వినియోగాన్ని నిషేధించింది. కొద్దిరోజులకే ఆ జాబితాలో ఆస్ట్రేలియాకూడా చేరింది. ఆస్ట్రేలియాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే పరికరాల్లో టిక్‌టాక్‌పై బ్యాన్ విధించింది. జాతీయ భద్రతా భయాల కారణంగా చైనా యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించే యాప్‌ను నిషేధిస్తున్నట్లు మంగళవారం ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది.

Tik Tok Laid Off Staff : టిక్ టాక్ కీలక నిర్ణయం.. భారత ఉద్యోగులు తొలగింపు

అటార్నీ జనరల్ మార్క్ డ్రేఫస్ ఈ విషయంపై మాట్లాడుతూ.. దేశంలోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సలహాను అనుసరించి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొద్దిరోజుల్లోనే ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. ఇదిలాఉంటే టిక్ టాక్‌పై ఇప్పటికే భారత్‌తో సహా యూఎస్, యూకే, కెనడా, న్యూజిలాండ్, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు నిషేధించాయి. ఫ్రాన్స్, నెదర్లాండ్స్, యూరోపియన్ కమిషన్ కూడా ఇలాంటి చర్యలను చేపట్టాయి. అయితే, కొన్నది దేశాల్లో పూర్తిస్థాయిలో టిక్ టాక్ ను నిషేధించగా.. కొన్ని దేశాల్లో కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లోనే వినియోగించే, ప్రభుత్వం డేటాను భద్రపర్చే పరికరాల్లోనే ఈ టిక్ టాక్ యాప్ పై బ్యాన్ విధించారు.