Sienna Weir : గుర్రపు స్వారీ ప్రమాదంలో మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ సియెన్నా వీర్ మృతి

ఆమెకు గుర్రపు స్వారీ అంటే ప్రాణం..గుర్రాలు అంటే ఎంతో ఇష్టం. గుర్రపుస్వారీ పోటీ్లో పాల్గొనటం ఆమె హాబీ..అదే ఆమె ప్రాణం తీసింది.

Sienna Weir : గుర్రపు స్వారీ ప్రమాదంలో మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ సియెన్నా వీర్ మృతి

Sienna Weir Dies

Miss Universe Finalist Sienna Weir : గుర్రపు స్వారీ చేస్తు ప్రమాదానికి గురి అయిన మిస్ యూనివర్స్ ఫైనలిస్టు (Miss Universe Finalist), ప్రముఖ మోడల్ సియోన్నా వీర్ (Sienna Weir Dies) మరణించారు. కేవలం 23 ఏళ్లకే సియోన్నా గుర్రపు స్వారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స్ పొందుతు మరణించారు. తన స్వస్థలమైన ఆస్ట్రేలియాలోని విండ్సర్ పోలో గ్రౌండ్స్‌లో గత ఏప్రిల్ 2న గుర్రపు స్వారీ చేస్తు (Horse Riding Accident) పడిపోయారు 2022 మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ సియోన్నా. ఈ ప్రమాదంలో ఆమె అత్యంత తీవ్రంగా గాయపడ్డారు. ఆమె మరణవార్తను కుటుంబ సభ్యులు, మోడలింగ్ ఏజెన్సీ స్కూప్ మేనేజ్‌మెంట్ కూడా ఆమె మరణాన్ని ధృవీకరించారు.

ఆమె గుర్రపు స్వారీ (Horse Riding Accident)ప్రమాదానికి గురి అయ్యాక ఆమెను చాలా రోజులపాటు లైఫ్ సపోర్ట్‌లో ఉంచారు. ఈక్రమంలో ఆమె లైఫ్ టైమ్ సపోర్టును తీసివేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. మోడలింగ్ ఏజెన్సీ స్కూప్ మేనేజ్‌మెంట్ సియెన్నాఫొటోలను గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తు ‘‘ఎప్పటికీ మన హృదయాల్లో’’ అని క్యాప్షన్ ఇచ్చారు.

కాగా..2022 ఆస్ట్రేలియన్ మిస్ యూనివర్స్ పోటీలో 27 మంది ఫైనలిస్టులలో సియన్నా వీర్ ఒకరుగా నిలిచారు. సియోన్నా సిడ్నీ విశ్వవిద్యాలయం (University of Sydney)నుంచి ఇంగ్లీష్ రిటరేచర్ (English Literature) మనస్తత్వశాస్త్రం ( Psychology)లో డబుల్ డిగ్రీ చేశారు. గతంతో ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతు నా కెరీర్ ను కొనసాగించటానికి యూకే వెళ్లాలనుకుంటున్నానని తెలిపారు.నా సోదరి,పిల్లలు ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నానని ఈ రెండింటికోసం యూకే వెళ్లాలని అనుకుంటున్నానని తెలిపారు.

అలాగే తాను మూడేళ్ల నుంచి గుర్రపు స్వారీ చేస్తున్నానని అది లేకుండా నా జీవితాన్ని ఊహించలేనని గుర్రపుస్వారీ అంటే నాకు చాలా చాలా ఇష్టమని తెలిపారు. వీకెండ్ లో న్యూ సౌత్ వేల్స్,ఆస్ట్రేలియాల్లో పలు ప్రాంతాలకు ట్రైనింగ్ మరియు పోటీల వారానికి 2-3 సార్లు వెళ్తానని తెలిపారు. ఆమెకు అత్యంత ఇష్టమైన గుర్రపు స్వారీయే ఆమెప్రాణాలు కోల్పోవటానికి కారణం కావటం నిజంగా దురదృష్టకరమని ఆమె సన్నిహితులు అంటున్నారు.