మసీదుల్లో ఉగ్రదాడిపై నోరుజారిన సెనేటర్.. తలపై గుడ్డుతో కొట్టిన యువకుడు

ఉగ్రదాడిపై సెనేటర్ మాట్లాడుతున్న సమయంలో యువకుడు.. కాసేపు తన ఫోన్ లో ఫొటోలు తీశాడు. అంతలోనే సెనేటర్ తలపై గుడ్డుతో కొట్టాడు. చిరెత్రుకొచ్చిన సెనేటర్ కుర్రాడిని చెంప చెల్లుమనిపించాడు

  • Published By: sreehari ,Published On : March 16, 2019 / 01:45 PM IST
మసీదుల్లో ఉగ్రదాడిపై నోరుజారిన సెనేటర్.. తలపై గుడ్డుతో కొట్టిన యువకుడు

ఉగ్రదాడిపై సెనేటర్ మాట్లాడుతున్న సమయంలో యువకుడు.. కాసేపు తన ఫోన్ లో ఫొటోలు తీశాడు. అంతలోనే సెనేటర్ తలపై గుడ్డుతో కొట్టాడు. చిరెత్రుకొచ్చిన సెనేటర్ కుర్రాడిని చెంప చెల్లుమనిపించాడు

న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ లోని రెండు మసీదుల్లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో 49 మందికిపైగా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై క్వీన్స్ లాండ్ లో ఆస్ట్రేలియా సెనేటర్ ఫ్రేసర్ అన్నింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రదాడి ఘటనకు కారణం.. ముస్లింల ఇమ్మిగ్రేషన్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే.. సెనేటర్ మాట పూర్తి అయ్యేలోపే ఆయన తలపై గుడ్డు పగిలింది. అది ఎవరో కాదు.. సెనేటర్ పక్కనున్న 17ఏళ్ల కుర్రాడు. ఉగ్రదాడిపై సెనేటర్ మాట్లాడుతున్న సమయంలో యువకుడు.. కాసేపు తన ఫోన్ లో ఫొటోలు తీశాడు. అంతలోనే సెనేటర్ తలపై గుడ్డుతో కొట్టాడు. చిరెత్రుకొచ్చిన సెనేటర్ కుర్రాడిని చెంప చెల్లుమనిపించాడు.

యువకుడిని కొడుతున్నసెనేటర్ ను అడ్డుకునేందుకు అక్కడి అధికారులు యత్నించగా.. ఆయన కింద పడిపోయాడు. గుడ్డుతో కొట్టిన యువకుడిని సెనేటర్ మద్దతుదారులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు.వారినుంచి అతడు తప్పించుకునేందుకు యత్నించగా.. నేలపై పడేసి పారిపోకుండా గట్టిగా పట్టుకున్నారు. క్వీన్స్ లాండ్ ఇండిపెండెంట్ సెనేటర్ న్యూజిలాండ్ ఉగ్రదాడి ఘటనపై మీడియాతో మాట్లాడుతుండగాయువకుడు గుడ్డుతో దాడి చేసినట్టు స్థానిక మీడియాల్లో కథనాలు వచ్చాయి.

యవకుడిని పట్టుకున్న పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండానే కాసేపటికి రిలీజ్ చేసినట్టు స్థానిక మీడియాలో నివేదిక వెల్లడించింది.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యవకుడు చేసిన పనిని నెటిజన్లు ఎగ్ బోయ్ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. సెనేటర్ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలను ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోర్రిసన్ తీవ్రంగా ఖండించారు. ఇస్లామిక్ కమ్యూనిటీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అన్నింగ్ పై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆస్ట్రేలియన్ పార్లమెంట్ నుంచి అన్నింగ్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆన్ లైన్ పిటిషన్ దాఖలైంది.