Ban from India: భారత్ నుంచి వస్తే ఐదేళ్లు జైలుకే!

Ban from India: భారత్ నుంచి వస్తే ఐదేళ్లు జైలుకే!

India

Australia Bans Arrivals from India: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి భారతదేశం నుండి వచ్చే ప్రయాణికులపై ఆస్ట్రేలియా తాత్కాలిక నిషేధం విధించింది. ఆస్ట్రేలియా పౌరులు కూడా దీనిని ఉల్లంఘిస్తే, ఐదేళ్ల జైలు శిక్ష మరియు 66 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

తాత్కాలిక నిషేధం సోమవారం నుండి అమల్లోకి రానుంది. ఆస్ట్రేలియాకు రావాలనుకునే మరియు 14 రోజుల్లో భారత్‌కు వెళ్లిన ప్రయాణికులకు ఈ షరతు వర్తిస్తుంది. భారతదేశంలో ప్రస్తుతం సుమారు తొమ్మిది వేల మంది ఆస్ట్రేలియన్లు ఉన్నారని, వారిలో 600 మంది అసురక్షితంగా వర్గీకరించబడ్డారని అంచనా.

ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ ఆపేందుకే..
ఆస్ట్రేలియా కేబినెట్ సమావేశం అనంతరం శుక్రవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ వైరస్ను ఆపే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. భారతదేశంలో కోవిడ్ -19 కేసులు వేగంగా పెరుగుతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతోంది.

ఈ నిర్ణయాన్ని లెక్కచేయకుండా ప్రవేశించిన పౌరులకు ఐదు ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 3వ తేదీ నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. నిషేదానికి సంబంధించిన ఆంక్షలపై మే 15వ తేదీన పునరాలోచన చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌లో కరోనా కేసులు తగ్గముఖం పట్టిన తరువాతే స్వేచ్ఛగా రవాణా చేసే అవకాశం ఉంది.

ఈ నిర్ణయంపై ఆస్ట్రేలియన్‌ పౌరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన మెడికల్‌ సర్జన్‌ నీలా జానకీరామన్ దేశానికి తిరిగి వచ్చే ఆస్ట్రేలియన్‌ పౌరులకు శిక్ష విధించడం హేయమైన చర్యగా భావించారు. ఇండో- ఆస్ట్రేలియన్లు ఈ నిర్ణయాన్ని జాతి వివక్షగా పరిగణిస్తున్నామని అన్నారు.