ఇల్లా కార్ల కంపెనీయా: 80 ఏళ్ల వృద్ధుడికి 80 లగ్జరీ కార్లు..చూస్తే కళ్లు చెదిరేలా

ఇల్లా కార్ల కంపెనీయా: 80 ఏళ్ల వృద్ధుడికి 80 లగ్జరీ కార్లు..చూస్తే కళ్లు చెదిరేలా

Austria Vienna 80 years old man collected 80 luxury cars : జీవితంలో ఒకే ఒక్క కారు కొనుక్కోవాలని ఎంతోమంది కల. కాస్త శ్రీమంతులైతే లగ్జరీ కార్లు కొనుక్కోవాలనుకుంటారు. మహా అయితే రెండు మూడు లగ్జరీ కార్లు కొంటారు. కానీ ఓ 80 ఏళ్ల వృద్ధుడు మాత్రం ఏకంగా లగ్జరీ కార్లు కొనటమే పనిగా పెట్టుకున్నాడు. అలా 80 కార్లు కొన్నాడు.

చాలామంది సెలబ్రిటీలు, కోటీశ్వరులు స్టేటస్ సింబల్ కోసం లగ్జరీ కార్లను సేకరిస్తుంటారు. కానీ 80 లగ్జరీ కార్లంటే మాటలు కాదు. ఆస్ట్రియా రాజధాని వియన్నాకు చెందిన 80ఏళ్ల ఒట్టొకర్ జె ఏకంగా 80 లగ్జరీ కార్లను సేకరించి మొత్తం ప్రపంచాన్నే ఆకర్షిస్తున్నాడు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం జె వంకే చూస్తున్నారు. ఒట్టొకర్ పజె తాజాగా 80వ పోర్స్చే బాక్స్టర్ స్పైడర్ (Porsche Boxster Spyder) కారు కొన్నాడు. లగ్జరీ కార్లు సేకరించటమంటే జెకు కొన్ని దశాబ్దాలుగా హాబీ.

1972లో ఒట్టొకర్ మొదటి పోర్స్చే కారును కొన్నాడు. అప్పటి నుంచి తన గ్యారేజీని వివిధ పోర్స్చే మోడళ్లతో నింపేస్తూనే ఉన్నాడు. అలా కొన్న కార్లను కొనటానికి ఏకంగా ఓ పేద్ద ఇంటినే కట్టాడు. అంటే ఆయనకు కార్లంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.

దాదాపు 50ఏళ్ల క్రితం ఒకరోజు అతడు రోడ్డుపై వెళ్తుండగా పోర్స్చే కారు అతని పక్కనుంచి ఫాస్ట్ గా దూసుకెళ్లిందట. అప్పటి నుంచి వాటిపై ఇష్టం పెరిగింది. ఆ కార్లు కొనటానికే డబ్బును పొదుపు చేసి మరీ కొంటాడు. అలా ఫస్టు టైమ్ పొదుపు చేసిన డబ్బులతో పోర్స్చే స్పీడ్ ఎల్లో 911 E కారును కొన్నాడు.

అరుదైన కార్లకు కేరాఫ్ అడ్రస్ ఒట్టొకర్
ఒట్టొకర్ తాజాగా మియామి బ్లూ కలర్ పోర్స్చే బాక్స్టర్ స్పైడర్ కారును సొంతం చేసుకున్నాడు. దీనికి అతడే మొట్టమొదటి కస్టమర్ ఒట్టొకరే కావటం మరో విశేషం. పోర్స్చే కంపెనీకి చెందిన జుఫెన్‌హౌసెన్ ఫ్యాక్టరీ నుంచి దాన్ని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం జె గ్యారేజీలో 38 వేర్వేరు పోర్స్చే మోడల్ కార్లు ఉన్నాయి. వాటిలో రేస్ కార్లు, ఎనిమిది సిలిండర్ల ఇంజిన్ ఉండే పోర్స్చే 910, 917, 956, 904, 964 కప్… వంటి అరుదైన మోడళ్లు ఉన్నాయి.

ఇప్పటి వరకు తొమ్మిది వెర్షన్ల కారెరా ఆర్ ఎస్ (Carrera RS) మోడళ్లను సేకరించాడు. ఫోర్సే కయోన్నె కారులో పాన్ అమెరికన్ హైవేపై వెళ్లాలని అతడు ప్రణాళిక వేస్తున్నాడు. ఇంతటితో ఆగిపోకుండా మరికొన్ని కార్లను సేకరిస్తానని ఒట్టొకర్ చెబుతున్నాడు.