కరోనా కారణంగా ఆరోగ్య మంత్రి రాజీనామా

కరోనా కారణంగా ఆరోగ్య మంత్రి రాజీనామా

Minister

కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అస్తవ్యస్తం అయ్యింది. ఎక్కడా కూడా అధికారులను ఊపిరి పీల్చుకోనివ్వట్లేదు. క‌రోనా ఆరోగ్య సిబ్బందిపై మాత్రమే కాదు.. రాజకీయ నేత‌ల‌పైనా తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. లేటెస్ట్‌గా ఆస్ట్రియా ఆరోగ్య మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. కరోనా వెలుగులోకి వచ్చినప్ప‌టి నుంచి పని ఒత్తిడి బాగా ఎక్కువైపోయిందని, ఇక త‌న వ‌ల్ల కాదంటూ ఆస్ట్రియా ఆరోగ్య శాఖ మంత్రి రుడాల్ఫ్ ఆన్షోబెర్ రాజీనామా చేశారు.

ఆన్షోబెర్ గత సంవత్సరం ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టగా.. అప్పటి నుంచే ప్రతిరోజు కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు తీరికలేకుండా 60ఏళ్ల వయస్సులో పనిచేయడం కష్టంగా అనిపించి రాజీనామా చేశారు. ప‌ని భారం వ‌ల్ల త‌న ఆరోగ్యం త‌ర‌చూ దెబ్బ‌తింటున్న‌ద‌ని క‌రోనా మ‌హ‌మ్మారి మళ్లీ విరుచుకుని పడుతుందని, కంట్రోల్ చేసే పరిస్థితి లేక ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు.

తొమ్మిదేళ్ల కింద కూడా ఇలాగే ప‌ని భారం ఎక్కువై కుప్ప‌కూలిపోయిన త‌న‌కు ఇప్పుడు బీపీ ఎక్కువ అయిపోతుందని, ఈ క‌రోనా కాలంలో 100శాతం ఫిట్‌గా ఉన్న ఆరోగ్య మంత్రి ఆస్ట్రియాకు అవసరం అని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు.