మనోళ్లకే ఫస్ట్ ప్రైజ్: మంచుతో మహావిష్ణు శిల్పం

మంచుపై శిల్పాలు చెక్కినారు.. దేశానికే ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టారు మనోళ్లు. హిందువుల ఆరాథ్యదైవం మహా విష్ణువు శిల్పాన్ని మంచుతో చెక్కి ఫస్ట్ ప్రైజ్ కొట్టేశారు.

  • Published By: sreehari ,Published On : February 14, 2019 / 10:47 AM IST
మనోళ్లకే ఫస్ట్ ప్రైజ్: మంచుతో మహావిష్ణు శిల్పం

మంచుపై శిల్పాలు చెక్కినారు.. దేశానికే ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టారు మనోళ్లు. హిందువుల ఆరాథ్యదైవం మహా విష్ణువు శిల్పాన్ని మంచుతో చెక్కి ఫస్ట్ ప్రైజ్ కొట్టేశారు.

మంచుపై శిల్పాలు చెక్కినారు.. దేశానికే ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టారు మనోళ్లు. హిందువుల ఆరాథ్యదైవం మహా విష్ణువు శిల్పాన్ని మంచుతో చెక్కి ఫస్ట్ ప్రైజ్ కొట్టేశారు మన భారతీయులు. జపాన్ లోని నయారోలో ఇంటర్నేషనల్ స్నో స్కల్ట్పింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ కాంపిటీషన్ నిర్వహించగా.. ఇందులో ముగ్గురు ఇండియన్స్.. మహా విష్ణు అవతారాన్ని మంచుతో చెక్కి అందరి దృష్టిని ఆకర్షించారు. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారతీయుల ఖ్యాతిని ఉన్నత స్థానంలో నిలిపారు. ఇండియాకు చెందిన రవి ప్రకాశ్, సునీల్ కుమార్ కుష్వా, రాజ్నిష్ వర్మ అనే ముగ్గురు కలిసి ఈ కాంపిటీషన్ లో పాల్గొన్నారు. 
 

అభ్యుదయ్ టీం మోనికర్ 4 మీటర్ల ఎత్తైన విష్ణు మంచు శిల్పాన్ని క్రియేట్ చేశారు. ఎముకలు కొరికేంత (25 డిగ్రీల ఉష్ణోగ్రత) చలిలో వీరు విష్ణు మంచు శిల్పాన్ని నిర్మించారు. 19ఏళ్లుగా నిర్వహస్తున్న అంతర్జాతీయ మంచు శిల్పాల పోటీలో ఇప్పటివరకూ భారత్ నుంచి ఏ ఒక్కరూ పోటీ పడలేదు. తొలిసారి ఇండియా నుంచి ఈ పోటీలో పాల్గొంది వీరే కావడం విశేషం. 
 

పోటీలో భాగంగా ఈ ముగ్గురు విష్ణు పది అవతారాల్లో వరాహ అవతారం, ఉగ్రనరసింహ అవతారం వంటి ఎన్నో మంచు శిల్పాలను రూపొందించి భారత్ తరపున ఫస్ట్ ఫ్రైజ్ గెలుచుకున్నారు. ఈ కాంపిటీషన్ లో మొత్తం 10 ప్రపంచ దేశాలు పోటీ పడగా.. మొదటి ఫ్రైజ్ ఇండియాను వరించగా.. రష్యా రెండోస్థానంలో నిలిచింది. థాయిలాండ్ టీమ్ మూడో ర్యాంకులో నిలిచింది. 

Also Read : తల్లి పడరాని పాట్లు: కొడుకు కోసం కాలేజీల్లో అమ్మాయిల వేట

Also Read : తండ్రి శవానికి ఐపీఎస్ ఆఫీసర్ నెలరోజులుగా చికిత్స

Also Read : ఎంతో టేస్టీ: ఆయుర్వేదిక్ ఐస్ క్రీం.. రుచి చూడాల్సిందే

Also Read :  ఫిబ్ర‌వ‌రిలోనే లాంచ్‌ : ‘రెడ్ మీ నోట్ 7’ వ‌చ్చేస్తోంది

Also Read : తెలుగులో కూడా పేటీఎం సేవలు

Also Read : ZOMATO CHAT: అమ్మతోడు సార్.. మీ డబ్బులు వచ్చేస్తాయ్