ఒక్కో అమెరికన్ తలపై రూ.66లక్షల అప్పు

ఒక్కో అమెరికన్ తలపై రూ.66లక్షల అప్పు

Americans Networth: ఒక్కో అమెరికన్ యావరేజ్ మొత్తం ఆదాయం రూ.5కోట్ల 45లక్షలు ఉంటే వారి తలపై రూ.66లక్షల అప్పులు ఉన్నాయట. పలు రకాల పెట్టుబడులతో వచ్చే లాభాలను దృష్టిలో పెట్టుకుని చేసిన ఖర్చులు లెక్కలేకుండాపోయాయి. మహమ్మారి ప్రభావానికి సేవింగ్స్ లో, పెట్టుబడులకు దాచిన మొత్తం అయిపోయింది.

ప్రతి రోజూ బడ్జెట్ ను చూసి లెక్కపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిపడింది. Fedఇచ్చిన సమాచారం మేరకు 35నుంచి 44ఏళ్లు మధ్య వయస్సున్న వారి ఆదాయం 66లక్షల 52వేలుగా ఉంది.

కోలుకోవడానికి వారేం చేయాల్సి ఉంటుందంటే..
ఆర్థిక నష్టం నుంచి కోలుకోవాలంటే రెండు దారులున్నాయి.
1. ఆదాయం పెంచుకోవడం
2. ఖర్చులు తగ్గించుకోవడం
రెండు దారులు నష్టాన్ని అధిగమించడానికే ఉపయోగపడతాయి.
అదే సమయంలో మీరూ 30లలో లేదా 40లలో ఉన్నారనుకోండి.. మీ పేరు మీద ఎంత ఖర్చు ఉందో గమనించండి. చాలామందిలో క్రెడిట్ కార్డులు, ఇన్‌స్టాల్మెంట్ లోన్లు, మార్ట్‌గేజ్‌లు కలిపి యావరేజ్‌గా 52వేల ఖర్చు తేలిందనుకుందాం.

ఖర్చు అనేది కామన్ అయిపో్యినప్పుడు అంచనా ప్రకారం.. అప్పు తీసుకోండి. ఆస్తులు ఉన్నదాని కంటే ఖర్చులు ఎక్కువ ఉంటే మీ ఆదాయం నెగెటివ్స్ లోకి వెళ్లిపోతుంది. దాంతో పాటు చిన్నపాటి అప్పులు చేస్తే మీరు పెట్టే పెట్టబడులు ఆలస్యం అయిపోతాయి. అది స్టాక్ మార్కెట్ అయినా.. రియల్ ఎస్టేట్ మార్కెట్ అయినా సరే.