అధిక బరువుతో అడవి గొర్రె అపసోపాలు.. 35కిలోల ఉన్ని కత్తిరించారు!

అధిక బరువుతో అడవి గొర్రె అపసోపాలు.. 35కిలోల ఉన్ని కత్తిరించారు!

Baarack Wild sheep rescued in Australia : అడవి గొర్రె.. ఉన్ని అమాంతం పెరిగిపోయింది. భారీగా ఉన్నిపెరిగిపోవడంతో మోయలేక అపసోపాలు పడుతోంది. దాదాపు 35 కిలోలకు పైగా ఉన్ని పెరిగిపోయింది. దట్టంగా పెరిగిన ఉన్నిని తొలగించడంతో ఇప్పుడా గొర్రె ఊపిరిపీల్చుకుంది. ఆస్ట్రేలియాలోని ఓ అడవిలో ఈ గొర్రె ఉంది. దీని పేరు బరాక్.. అధిక బరువు మోయలేక గొర్రె నడవలేక చాలా ఇబ్బందులు పడుతోంది. అంటే దాదాపు పెద్ద కంగారులో సగానికి పైగా బరువు పెరిగింది.
ఉత్తర మెల్ బోర్న్ కు 60 కిలోమీటర్ల దూరంలోని విక్టోరియాలో లాన్స్ ఫీల్డ్ సమీపంలో ఎడ్గర్ మిషన్ ఫామ్ శాంచురీకి చెందిన సభ్యులు ఒకరు ఈ అడవి గొర్రెను గుర్తించారు.

భారీగా పెరిగిన ఉన్నితో బరువు మోయలేక అపోసోపాలు పడుతున్న గొర్రెను చూసి దానికి విముక్తి కల్పించాలనుకున్నాడు. సాధారణంగా గొర్రెలకు ఏడాదికి ఒకసారి ఉన్ని కత్తిరించాల్సి ఉంటుంది. లేదంటే ఉన్ని పెరిగిపోతూనే ఉంటుంది. ఏడాదిపైగా ఉన్ని కట్ చేయకుండా అలానే ఉండటంతో 35.4 కిలోల బరువు పెరిగింది.

ఉన్ని కారణంగా గొర్రె ముఖం కూడా కనిపించడం లేదు. ముఖం చుట్టూ నిండిపోయింది. గొర్రెను రక్షించిన మిషన్ కైల్ బెహ్రెండ్.. ఉన్నిని కత్తిరించడంతో ఊపిరిపీల్చుకున్నట్టయింది. ఇప్పుడు ఆ గొర్రె తేలికగా తిరుగుతోంది. ఉన్ని మొత్తం కత్తిరించడంతో తెల్లగా మెరిసిపోతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.