Babies In The Womb: గర్భంలో శిశువులకు ఏమిష్టమో తెలుసా.. తొలిసారిగా బయటపడ్డం నిజం.. ఫొటోలే సాక్ష్యం

గర్భంలోని శిశువులు కూడా తల్లులు తినే ఆహారానికి స్పందిస్తాయి. వారు మంచి ఆహారం తీసుకుంటే ఆనంద పడతాయి. లేకుంటే బాధపడతాయి. దీనికి సంబంధించిన ఆధారాల్ని శాస్త్రవేత్తలు తాజాగా విడుదల చేశారు.

Babies In The Womb: గర్భంలో శిశువులకు ఏమిష్టమో తెలుసా.. తొలిసారిగా బయటపడ్డం నిజం.. ఫొటోలే సాక్ష్యం

Babies In The Womb: గర్భిణి తినే ఆహారానికి, వారి కదలికలకు గర్భంలోని శిశువులు (పిండాలు) స్పందిస్తాయనే సంగతి తెలిసిందే. గర్భిణులు మంచి ఆహారం తీసుకున్నప్పుడు గర్భస్థ శిశువులు ఆనంద పడటం, నచ్చని ఆహారం తీసుకున్నప్పుడు బాధపడటం కూడా చేస్తాయట.

Honour Killing: పరువు హత్య కేసు… కూతురును, ఆమె ప్రియుడిని చంపిన తల్లిదండ్రులు.. మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు

ఈ విషయం గురించి ఎప్పట్నుంచో ప్రచారంలో ఉన్నా.. తాజాగా ఆధారాలతో దీన్ని నిరూపించారు ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు. దీనికి సంబంధించిన అల్ట్రాసౌండ్ రిపోర్టును కూడా వారు విడుదల చేశారు. ఈ పరిశోధన ప్రకారం.. ఇంగ్లండ్ పరిశోధకులు వంద మంది గర్భిణులను ఎంపిక చేసి వారిని మూడు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు గర్భిణులకు కాకర కాయతో తయారు చేసిన క్యాప్సూల్స్ ఇచ్చారు. మరో గ్రూపు గర్భిణులకు క్యారెట్‌తో తయారు చేసిన క్యాప్సూల్స్ ఇచ్చారు. ఇంకో గ్రూప్‌నకు ఏ ఫ్లేవర్ లేని క్యాప్సూల్స్ ఇచ్చారు. గర్భిణులు వీటిని తీసుకున్న 20 నిమిషాల తర్వాత వారికి 4డీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

Uttar Pradesh Shocker: పాస్‌పోర్ట్ ఫొటో కోసం స్టూడియోకు వెళ్లిన అమ్మాయి.. ఒంటరిగా ఉండటంతో ఫొటోగ్రాఫర్ అసభ్య ప్రవర్తన

కాకర కాయ క్యాప్సూల్స్ తిన్న గ్రూపునకు చెందిన గర్భస్థ శిశువులు బాధతో, దిగాలుగా ముఖం పెట్టుకుని ఉంటే, క్యారెట్ క్యాప్సూల్స్ తిన్న గ్రూపునకు చెందిన శిశువులు నవ్వుతూ ముఖం పెట్టుకున్నాయి. ఏ ఫ్లేవర్ లేని క్యాప్సూల్స్ తిన్న గ్రూప్ గర్భిణులకు చెందిన శిశువుల ముఖాలు కూడా ఆనందంగానే కనిపించాయి. దీన్ని బట్టి గర్భంలోని శిశువులు కూడా తల్లులు తీసుకునే ఆహారానికి స్పందిస్తున్నట్లు, నవ్వడం, ఏడ్వడం వంటి భావాలు కలిగి ఉన్నట్లు తేలింది. గర్భిణులు మంచి ఆహారం తీసుకుంటే, దాని ప్రభావం గర్భస్థ శిశువులపై ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.