Baby girl-tail: తోకతో జన్మించి అందరినీ ఆశ్చర్యపర్చిన పాప.. చివరకు..

ఓ పాప తోకతో జన్మించి అందరినీ ఆశ్చర్యపర్చింది. చివరకు ఆపరేషన్ చేసి ఆ తోకను వైద్యులు తొలగించారు. మెక్సికోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ పాప తోకకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ పాపకు సంబంధించిన వివరాలను వైద్యులు మీడియాకు వివరించారు. ఆ పాప తోకను సూదితో తాకిన సమయంలో ఆ శిశువు ఏడ్చిందని, తోకకు స్పర్శ కూడా ఉన్నట్లు తెలుసుకున్నామని చెప్పారు.

Baby girl-tail: తోకతో జన్మించి అందరినీ ఆశ్చర్యపర్చిన పాప.. చివరకు..

Baby girl-tail

Baby girl-tail: ఓ పాప తోకతో జన్మించి అందరినీ ఆశ్చర్యపర్చింది. చివరకు ఆపరేషన్ చేసి ఆ తోకను వైద్యులు తొలగించారు. మెక్సికోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ పాప తోకకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ పాపకు సంబంధించిన వివరాలను వైద్యులు మీడియాకు వివరించారు. ఆ పాప తోకను సూదితో తాకిన సమయంలో ఆ శిశువు ఏడ్చిందని, తోకకు స్పర్శ కూడా ఉన్నట్లు తెలుసుకున్నామని చెప్పారు.

ఆ తోక పొడవు 5.7 సెంటీమీటర్లు ఉన్నట్లు వివరించారు. మెక్సికోలో ఇటువంటి కేసు నమోదు కావడం తొలిసారని అన్నారు. పాప ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని చెప్పారు. ఆ శిశువు జన్మించిన రెండు నెలల తర్వాత సర్జరీ చేసి తోకలను దశలవారీగా తొలగించినట్లు వివరించారు. శిశువు తల్లి కడుపులో ఉన్న సమయంలో తోక వంటి ఆకృతి ఏర్పడి, తొమ్మిది నెలలు నిండేలోపు ఎముకగా మారి లొపలికి వెళ్లిపోతుంది.

చాలా అరుదుగా శిశువులు తోకలతో జన్మిస్తారు. బ్రెజిల్ లో ఓ బాలుడు గత ఏడాది 12 సెంటీమీటర్ల పొడవు తోకతో జన్మించాడు. కాగా, ప్రపంచంలో ఇప్పటివరకు తోకతో జన్మించిన శిశువుల సంఖ్య దాదాపు 200గా ఉంది. సాధారణంగా శిశువులు తోకతో జన్మించిన కొన్ని రోజుల్లోనే ఆ తోకను ఆపరేషన్ చేసి వైద్యులు తొలగిస్తుంటారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..