చైనాలో బ్యాక్టీరియా టెన్షన్: 3,245 మందికి పాజిటివ్

  • Published By: vamsi ,Published On : September 18, 2020 / 08:34 AM IST
చైనాలో బ్యాక్టీరియా టెన్షన్: 3,245 మందికి పాజిటివ్

వాయువ్య చైనాలోని గన్షు ప్రావిన్స్‌ రాజధాని లాంగ్‌ఝౌలో అనేక వేల మంది బ్యాక్టీరియా వ్యాధి భారిన పడ్డారు అనేకమందికి పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు చెప్పారు, గతేడాది బయోఫార్మాస్యూటికల్ కంపెనీలో లీక్ కావడం వల్ల సంభవించిన వ్యాప్తి ఇది అని అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితి ఇప్పుుడు డ్రాగన్ కంట్రీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.




ఈ ప్రాంతంలో 3,245 మందికి బ్రూసెల్లోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా వ్యాధి సోకినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న చైనాకు ఇది తీవ్ర ఇబ్బందిగా మారింది. క‌రోనా వైర‌స్ కూడా ఓ ల్యాబ్ నుంచే బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్న వాద‌న‌లు బ‌లంగా వినిపిస్తుండగా.. ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ నుంచి ప్రమాదకరమైన బ్రుసెల్లా బ్యాక్టీరియా లీక్ అయిందని చెబుతున్నారు. దీంతో వేలాదిమంది మాల్టా వ్యాధి బారిన పడ్డారు.
https://10tv.in/autumn-babies-are-more-likely-to-suffer-from-food-allergies-asthma-and-hay-fever-scientists-find-in-india/
వాయువ్య చైనాలోని గన్షు ప్రావిన్స్‌ రాజధాని లాంగ్‌ఝౌలో ఉన్న ఝోంగ్‌ము లాంగ్‌ఝౌ బయోలాజికల్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ నుంచి గతేడాది జూలై-ఆగస్టు మధ్య ఈ బ్యాక్టీరియా లీక్‌ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 3,245మందికి ఈ బ్యాక్టీరియా సోకగా.. బ్యాక్టీరియా సోకినవారు తలనొప్పి, కండరాల నొప్పి, జ్వరం, అలసటతోపాటు దీర్ఘకాలికంగా ఆర్థరైటిస్‌ తదితర సమస్యలతో బాధపడుతారని అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్ వెల్ల‌డించింది.




ఇది మనిషి నుంచి మనిషికి సోకటం అరుదని, బ్యాక్టీరియా సోకిన ఆహార పదార్ధాలు తినటం ద్వారా వ్యాపిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ బ్యాక్టీరియా వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని నగర ఆరోగ్య కమిషన్ తెలిపింది. నగరంలోని 2.9 మిలియన్ల జనాభాలో మొత్తం 21,847 మందిని అధికారులు పరీక్షించారు. మాల్టా జ్వరం లేదా మధ్యధరా జ్వరం అని కూడా పిలువబడే ఈ వ్యాధి కారణంగా కొన్ని లక్షణాలు దీర్ఘకాలిక సమస్యలు వస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు.