Balenciaga ‘Trash Bag’ : చెత్త వేసుకునే బ్యాగు ధర అక్షరాలా రూ. లక్ష పైనే..

‘రబ్బిష్‌ బిన్‌’ పేరుతో చిరిగిపోయిన షూస్‌ను రూ.2 లక్షల లకు అమ్మి విమర్శలు ఎదుర్కొందీ లగ్జరీ బ్రాండ్‌ బలెన్సియాగా మరో ఐటెమ్ తో ముందుకొచ్చింది.అదే ‘బిన్ బ్యాగ్’. ఈ బిన్ బ్యాగ్ ధర అక్షరాలు లక్షకు పైనే. అంటే రూ.1.4లక్షలు.

Balenciaga ‘Trash Bag’ : చెత్త వేసుకునే బ్యాగు ధర అక్షరాలా రూ. లక్ష పైనే..

Balenciaga ‘Trash Bag’Rs.1.4 lakh

Balenciaga ‘Trash Bag’ : ‘రబ్బిష్‌ బిన్‌’ పేరుతో చిరిగిపోయిన షూస్‌ను రూ.2 లక్షల లకు అమ్మి విమర్శలు ఎదుర్కొందీ లగ్జరీ బ్రాండ్‌ బలెన్సియాగా మరో ఐటెమ్ తో ముందుకొచ్చింది.అదే ‘బిన్ బ్యాగ్’. ఈ బిన్ బ్యాగ్ ధర అక్షరాలు లక్షకు పైనే. అంటే రూ.1.4లక్షలు. ‘ట్రాష్‌ పౌచ్‌’గా పిలుస్తున్న ఈ బ్యాగులను మృదువైన దూడ తోలుతో తయారుచేసి.. గ్లాసీ కోటింగ్‌ ఇచ్చింది. నలుపు, తెలుపు, నీలం, పసుపు రంగుల్లో వీటిని అందుబాటులోకి తెచ్చింది.

బ్యాగును క్లోజ్‌ చేయటానికి బ్యాక్‌పాక్‌కు ఉన్నట్టుగా త్రెడ్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. అంతే లగ్జరీగా వింటర్‌–22 కలెక్షన్‌లో విడుదల చేసింది. ఈ ట్రాష్ బ్యాగులకు సంబంధించిన వీడియోలు..ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దానికి తగ్గట్టుగా ధర కూడా ఉంది. ఈ ట్రాష బ్యాగుల ధర చూసి కళ్లు తిరిగిన ట్విట్టర్‌ యూజర్స్‌ మీమ్స్‌తో సదరు కంపెనీని ఓ ఆడుకుంటున్నారు.

కొంతమంది కాస్త ఘాటుగా వాయించేస్తున్నారు. ‘‘చెత్త బ్యాగుకోసం లక్షన్నర ఖర్చు చేయగలిగినవాళ్లకి దాన్నిండా నింపగలిగేంత క్యాష్‌ బ్యాంకులో ఉండే ఉంటుంది. అలా నింపేసి అవసరంలో ఉన్నవారికి చారిటీగా ఇచ్చేయొచ్చు కదా’’ అని ట్వీటాడో యూజర్‌. మరో యూజర్అయితే ఆ చెత్త బ్యాగ్‌ను తీసుకుని మీరు వెళ్తే… మిమ్మల్ని దోచుకోవడానికి కొంతమందిని పంపిస్తాలే’ అంటూ సెటైవ్ వేశాడు.కాగా బలెన్సియాకు ఇటువంటి విమర్శలు..తిట్లు కొత్తకాదు. 2022 మేలో ‘రబ్బిష్‌ బిన్‌’ పేరుతో చిరిగిపోయిన షూస్‌ను రూ.2 లక్షల లకు అమ్మి ఇలాంటి తిట్లే ఆశీర్వాదాలుగా అందుకొందీ కంపెనీ..దీంతో దటీజ్ ‘బలెన్సియా అన్నట్లుగా ఉంది ఈ కంపెనీ తీరు. అవును మరి ఓ కంపెనీ బ్రాండ్ గా మారింది అంటూ అక్కడే చెత్త కూడా ఖరీదుగానే ఉంటుందిలెండి అంటున్నారు ఇంకొంతమంది యూజర్లు.