G20 summit.. Xi Jinping-Joe Biden : బాలిలో G20 సదస్సులో బైడన్, జిన్‌పింగ్ మధ్య జరగబోయే చర్చలపై యావత్ ప్రపంచం దృష్టి

బాలిలో జీ 20 సదస్సులో భాగంగా బైడన్, జిన్‌పింగ్ మధ్య జరగబోయే సమావేశం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఈ సమావేశంలో తైవాన్‌పై చైనా యుద్ధానికి పాల్పడితే అమెరికా ఏం చేస్తుంది? ఈ సమావేశంలో దీనికి గురించి చర్చ జరుగుతుందా? రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగిసేలా ఒత్తిడి తెస్తాయా...? రెండు దేశాల సంబంధ బాంధవ్యాలు భవిష్యత్‌లో ఎలా ఉండబోతున్నాయి? సూపర్ పవర్ పోటీని నిలిపేస్తాయా...కొత్త వ్యూహాలతో ముందుకు తీసుకెళ్తాయా..? ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన రెండు దేశాల అధినేతల సమావేశం కలిగిస్తున్న సందేహాలివి. బాలి వేదికగా జరిగే ఈ సమావేశాల్లో ఈ అధినేతలు జరిపే చర్చలపై యావత్ ప్రపంచం దృష్టి పెట్టింది.

G20 summit.. Xi Jinping-Joe Biden : బాలిలో G20 సదస్సులో బైడన్, జిన్‌పింగ్ మధ్య జరగబోయే చర్చలపై యావత్ ప్రపంచం దృష్టి

G20 summit.. Xi Jinping-Joe Biden

G20 summit.. Xi Jinping-Joe Biden : మరోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నిక అయిన తరువాత జిన్ పింగ్ దూకుడు పెంచారు. యుద్ధానికి సిద్దంగా ఉండండీ అంటూ తన సైన్యానికి ఆదేశించారు. ఈక్రమంలో బాలిలో జీ 20 సదస్సులో భాగంగా బైడన్, జిన్‌పింగ్ మధ్య జరగబోయే సమావేశం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఈ సమావేశంలో తైవాన్‌పై చైనా యుద్ధానికి పాల్పడితే అమెరికా ఏం చేస్తుంది? ఈ సమావేశంలో దీనికి గురించి చర్చ జరుగుతుందా? రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగిసేలా ఒత్తిడి తెస్తాయా…? రెండు దేశాల సంబంధ బాంధవ్యాలు భవిష్యత్‌లో ఎలా ఉండబోతున్నాయి? సూపర్ పవర్ పోటీని నిలిపేస్తాయా…కొత్త వ్యూహాలతో ముందుకు తీసుకెళ్తాయా..? ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన రెండు దేశాల అధినేతల సమావేశం కలిగిస్తున్న సందేహాలివి. బాలి వేదికగా జరిగే ఈ సమావేశాల్లో ఈ అధినేతలు జరిపే చర్చలపై యావత్ ప్రపంచం దృష్టి పెట్టింది.

రష్యా, అమెరికా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత అగ్రరాజ్యం అన్న పేరుకు పెద్దన్న పర్యాయపదంగా మారింది. 1990ల నుంచి ప్రపంచంలో అమెరికా ఆడింది పాడింది పాటగా సాగింది. ఇష్టమున్నాలేకపోయినా..అన్ని దేశాలు అమెరికా పెత్తనాన్ని సహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే కాలంలో అమెరికాతో శత్రుత్వం, మిత్రుత్వం లేకుండా…సమాంతరశక్తిగా ఎదిగింది చైనా. అభివృద్ధి, ఆటలు, సాంకేతికత, స్పేస్ ఇలా అన్ని రంగాల్లో అమెరికాతో సై అంటే సై అంటోంది. ఓ రకంగా అమెరికా సూపర్ పవర్ హోదాకు ఎసరు తెచ్చే స్థితికి ఎదిగింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక…అగ్రరాజ్యానికి, డ్రాగన్‌కు మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. కరోనా వైరస్‌ను చైనా వైరస్ అని బహిరంగంగానే విమర్శించారు ట్రంప్.

బైడన్ అధ్యక్షుడయ్యాక పరిస్థితిలో కాస్త మార్పు వచ్చినప్పటికీ..అమెరికా, చైనా సంబంధాలు అంతంతమాత్రమే అన్న సంగతి అందరికీ తెలుసు. అమెరికాను పడదోసి..ఎలాగైనా సూపర్ పవర్ అనిపించుకునేందుకు చైనా శక్తియుక్తులన్నీ కేంద్రీకరిస్తోంది. అగ్రరాజ్య హోదా పోగొట్టుకుండా ఉండాలంటే..చైనాను నిలవరించడమనే మార్గమొక్కటే అమెరికా ముందుంది. దీంతో అధికారంలో డెమోక్రట్లున్నా, రిపబ్లికన్లున్నా చైనా టార్గెట్‌గానే వ్యూహాలు రచిస్తున్నాయి అమెరికా ప్రభుత్వాలు. చైనా మరింత శక్తిమంతంగా మారకుండా ఉండడానికి చేయదగిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. భారత్ సహా చైనాతో శతృత్వం ఉన్న దేశాలను కలుపుకుని క్వాడ్ కూటమిగా పనిచేయడం, ఇండో పసిఫిక్ వ్యవహారాల్లో తలదూర్చడం, తైవాన్‌ విషయంలో పదే పదే జోక్యం చేసుకోవడం, వియ్‌ఘర్ ముస్లింల గురించి అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించడం వంటివన్నీ ఇందులో భాగాలే.

చైనా విషయంలో బైడన్ ట్రంప్‌లా దూకుడుగా వెళ్లనప్పటికీ…మరీ సుతీమెత్తగానూ వ్యవహరించడం లేదు. అమెరికా చట్టసభల స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనే దీనికి ఉదాహరణ. చైనా దాడికి దిగే అవకాశముందని తెలిసినప్పటికీ…నాన్సీపెలోసీ పట్టుబట్టి తైవాన్‌లో పర్యటించారు. అధ్యక్షుని అనుమతి లేకుండా ఇది జరిగే అవకాశం లేదు. నాన్సీ పెలోసీ పర్యటన తర్వాత చైనా, తైవాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు..వాటిపై అమెరికా స్పందన కలిసి..ఓ దశలో…చైనా, అమెరికా మధ్య యుద్ధం జరుగుతుందా అన్న సందేహాలు కలిగాయి. చైనా తాత్కాలికంగా వెనక్కి తగ్గినప్పటికీ..తైవాన్ ఆక్రమణ.. డ్రాగన్ దీర్ఘకాలికఅజెండా. ఏదో ఓ రోజు చైనా తైవాన్ ఆక్రమణకు ప్రయత్నిస్తుంది. అమెరికా దాన్ని అడ్డుకుంటుంది. చివరకు ఈ యుద్దం అమెరికా, చైనా మధ్యే జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 20వ కాంగ్రెస్‌లోనూ, ఇటీవల ఆర్మీని ఉద్దేశించి చేసిన ప్రసంగంలోనూ తైవాన్‌పై తమకున్న ఆకాంక్షను జిన్‌పింగ్ బహిరంగంగానే వెల్లడించారు. చైనా ఏకీకరణ దేశ ప్రజలు కోరుకున్న విధంగా జరిగి తీరుతుందని, బలప్రయోగానికైనా వెనకాడబోమని తేల్చిచెప్పారు. చైనా అస్థిర, అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కుంటోందని..యుద్ధానికి, పోరాడి విజయం సాధించడానికి సన్నద్ధంగా ఉండాలని, ఆర్మీ మరింత బలోపేతం కావాలని..పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పిలుపునిచ్చారు. అంటే అతిత్వరలో యుద్ధం తప్పదన్న సంకేతాలిచ్చారు. ఈ తరుణంలో జీ 20 సదస్సులో బైడన్, జిన్‌పింగ్ భేటీ అవుతున్నారు.

బైడన్ అధికారంలోకి వచ్చాక ….ఆయన జిన్‌పింగ్‌తో నేరుగా సమావేశం కావడం ఇదే తొలిసారి. చైనాతో తమ సంబంధాల విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నామని, తైవాన్ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని బైడన్ చెబుతున్నారు. తైవాన్ అంశాన్ని తప్పకుండా చర్చిస్తామన్నారు. తైవాన్‌తో వాణిజ్య సంబంధాలు అమెరికాకు అత్యంత కీలకం. అందుకే ఒకే చైనా విధానానికి కట్టుబడి ఉన్నామని చెబుతూనే..తైవాన్‌కు ఆయుధాల నుంచి ఆర్థిక సాయం దాకా అన్నీ చేస్తోంది. చైనా కన్నా ముందుగానే యుద్ధసన్నాహాలు చేస్తోంది. అమెరికా విధానాలను గమనిస్తున్న జిన్‌పింగ్..యుద్దంతో పనిలేకుండా ….తైవాన్‌ను నయానో భయానో లొంగదీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. యుద్ధ సన్నాహాలతో భయపెట్టడం, ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధించడం వంటివి ఇందులో భాగమే. తైవాన్‌తో తగవులు తమ అంతర్గత వ్యవహారమని…అమెరికాకు చెప్పడంతో పాటు…ఆ విషయాన్ని అగ్రరాజ్యం గుర్తించేలా చేయాలన్నది డ్రాగన్ వ్యూహం.

తైవాన్‌ విషయంలో అమెరికా జోక్యం చేసుకునేలా చేసి..కొత్త తలనొప్పులు తెచ్చుకునేందుకు చైనా సిద్ధంగా లేదు. ఓ పక్క అగ్రరాజ్య హోదా కోసం అమెరికాతో పోటీ పడుతోంది డ్రాగన్. కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్‌లో ప్రచ్ఛన్నయుద్ధం తాను కోరుకోవడం లేదని జిన్‌పింగ్ చెప్పినప్పటికీ…అమెరికాకు, చైనాకు మధ్య అది కొనసాగుతోందన్నది కాదనలేని వాస్తవం. ఇలా అమెరికాతో యుద్ధాన్ని పరోక్షంగానే కొనసాగించాలి తప్ప…ప్రత్యక్ష యుద్దంలో నేరుగా తలపడడం చైనా అభిమతం కాదు. అందుకే…బాలిలో చర్చల విషయంలో కూడా తైవాన్ తమ అంతర్గత వ్యవహారమనే జిన్‌పింగ్ వాదిస్తారు. బైడన్ కూడా ఒన్ చైనా పాలసీని ఒప్పుకుంటూనే తాను చేయాల్సింది చేస్తారు. కాబట్టి ఇద్దరు నేతల భేటీతో తైవాన్ విషయంలో ఓ పరిష్కారం ఆశించడం అత్యాశే అన్నది అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం.

ఇక అమెరికా, చైనా అధినేతల మధ్య రష్యా, యుక్రెయిన్ యుద్దం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎనిమిదిన్నర నెలలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు చైనా చొరవచూపాలని అమెరికా కోరనుంది. చైనాకు, రష్యాకు మధ్య ఉన్న స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని..బైడన్..పుతిన్‌కు నచ్చజెప్పేలా జిన్‌పింగ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించవచ్చు.