Bangkok: భార్య మృతదేహంతో 21ఏళ్లుగా సహజీవనం.. రాత్రిళ్లు శవపేటిక వద్ద కబుర్లు..

72 ఏళ్ల వృద్ధుడు తన భార్య మృతదేహంతో 21సంవత్సరాలు సహజీవనం సాగిస్తున్నాడు. రాత్రివేళల్లో తన భార్యను ఉంచిన శవపేటిక వద్ద ఏంచక్కా కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తుండేవాడు. అయితే ఎట్టకేలకు...

Bangkok: భార్య మృతదేహంతో 21ఏళ్లుగా సహజీవనం.. రాత్రిళ్లు శవపేటిక వద్ద కబుర్లు..

Old Man

Bangkok: 72 ఏళ్ల వృద్ధుడు తన భార్య మృతదేహంతో 21సంవత్సరాలుగా సహజీవనం సాగిస్తున్నాడు. రాత్రివేళల్లో తన భార్యను ఉంచిన శవపేటిక వద్ద ఏంచక్కా కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తుండేవాడు. అయితే ఎట్టకేలకు ఓ ఫౌండేషన్ సాయంతో తన భార్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ ఘటన థాయ్ ల్యాండ్ లో వెలుగు చూసింది. బ్యాంగ్ ఖేన్ జిల్లాలో ఉండే చార్న్ జాన్ వాచకల్ కు 72ఏళ్లు. ఆయన భార్య 21ఏళ్ల క్రితం కన్నుమూసింది. భార్య మరణాన్ని జీర్ణించుకోలేక పోయిన చార్న్ జాన్ వాచకల్ ఆమె మృతదేహాన్ని శవపేటికలో భద్రపర్చాడు. సదరు వృద్ధుడు బాగా చదువుకున్న వ్యక్తి, అతని పేరుకు అనేక డిగ్రీలు ఉన్నాయి. కానీ భార్యను కోల్పోయిన తర్వాత చిన్నగదిలో కరెంటు కూడా లేకుండా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. రాత్రివేళల్లో తన భార్యను ఉంచిన శవపేటిక వద్ద కూర్చోని మాట్లాడుతుండేవాడు.

NFH Survey: భారత్‌లో 30%మంది మహిళలు శారీరక, లైంగిక హింసకు గురవుతున్నారు.. 80శాతం కేసుల్లో భర్తే నేరస్తుడట..
అయితే ఎట్టకేలకు 21ఏళ్ల తరువాత ఏప్రిల్ 30న భార్యకు అంతక్రియలు నిర్వహించాడు. భార్య మృతదేహానికి దహనసంస్కారాలు చేసేందుకు ఫెట్ కాసెమ్ బ్యాంకాక్ ఫౌండేషన్‌ని సహాయం కోరాడు. దీంతో స్థానికులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే చార్న్ తన భార్య తో మాట్లాడుతున్న వీడియో వైరల్ గా మారింది.. ఈ వీడియోలో చిన్న పని మీద బయటకు వెళ్తున్నావు అంతేనమ్మా.. కాసేపటి తర్వాత మళ్లీ తిరిగి వచ్చేస్తావు అని చెప్పడం వినిపిస్తోంది. ఆమె చనిపోయినప్పుడే భార్య మరణించినట్లు చార్న్ ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేయించాడు. అందువల్ల అతను మృతదేహాన్ని దాచినట్లు కాదని, అతనిపై ఎలాంటి కేసు ఉండదని అధికారులు చెప్పారు.