China Sinopharm Covid Vaccine : చైనా సినోఫార్మ్ కరోనా వ్యాక్సిన్‌కు బంగ్లాదేశ్ ఆమోదం

చైనాకు చెందిన సినోఫార్మ్ అనుబంధ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను అత్యవసరంగా వినియోగానికి బంగ్లాదేశ్ డ్రగ్ రెగ్యులేటర్ గురువారం ఆమోదించింది. భారతదేశంలో కరోనా కేసుల తీవ్రత కారణంగా బంగ్లాదేశ్ కు వ్యాక్సిన్ల సరఫరా క్షీణించింది.

China Sinopharm Covid Vaccine : చైనా సినోఫార్మ్ కరోనా వ్యాక్సిన్‌కు బంగ్లాదేశ్ ఆమోదం

China Sinopharm Covid Vaccine

China Sinopharm Covid Vaccine : చైనాకు చెందిన సినోఫార్మ్ అనుబంధ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను అత్యవసరంగా వినియోగానికి బంగ్లాదేశ్ డ్రగ్ రెగ్యులేటర్ గురువారం ఆమోదించింది. భారతదేశంలో కరోనా కేసుల తీవ్రత కారణంగా బంగ్లాదేశ్ కు వ్యాక్సిన్ల సరఫరా క్షీణించింది. ఈ క్రమంలో COVID-19 టీకాల కోసం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిన బంగ్లాదేశ్.. చైనా వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. భారతదేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరగడంతో ఆస్ట్రాజెనెకా (AZN.L) ఎగుమతులను నిలిపివేసింది. ఆ తరువాత బంగ్లాదేశ్ వ్యాక్సిన్ల కోసం ప్రయత్నాలు చేపట్టింది.

చైనా సినోఫార్మ్ వ్యాక్సిన్ 5లక్షల మోతాదు రెండు వారాల్లో బంగ్లాదేశ్‌కు చేరుకుంటుందని ఆశిస్తున్నామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ మహబూబర్ రెహ్మాన్ అన్నారు. ఈ వారం రెగ్యులేటర్ రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ (L1N2MK0TP)ను కూడా ఆమోదించింది. బంగ్లాదేశ్‌లో రష్యన్, సినోఫార్మ్ వ్యాక్సిన్ల తయారీపై కూడా ప్రభుత్వ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని రెహ్మాన్ తెలిపారు. ఈ వారం చివరి నాటికి సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతి ఇవ్వాలా వద్దా అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్ణయించాలని భావిస్తోంది.

సినోఫార్మ్ వ్యాక్సిన్ సమర్థత డేటాను చైనా బహిరంగంగా విడుదల చేయలేదు. కానీ, డెవలపర్, సినోఫార్మ్ అనుబంధ సంస్థ చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (CNBG) యూనిట్ బీజింగ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ ఇన్స్టిట్యూట్, వ్యాక్సిన్ 79.34శాతం ప్రభావవంతంగా ఉందని పేర్కొంది. చైనా, పాకిస్తాన్, యూఏఈతో సహా పలు దేశాల్లో ఈ కరోనా వ్యాక్సిన్‌కు ఆమోదం లభించింది. బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై ఆధారపడుతోంది. ఫిబ్రవరిలో టీకాలు ప్రారంభించినప్పటి నుండి సుమారు 6 మిలియన్ల మందికి టీకాలు వేయించారు. చివరికి దేశంలోని 170 మిలియన్ల జనాభాలో 80శాతం మందికి టీకాను భావిస్తోంది. ఈ వారం భారతదేశం నుంచి ఎగుమతులపై అనిశ్చితి నెలకొనడంతో మొదటి డోసుల నిర్వహణను నిలిపివేసింది.

ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో బంగ్లాదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది. 30 మిలియన్ మోతాదుల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోసం ఆర్డర్ చేయగా.. ఇప్పటివరకు కేవలం 7 మిలియన్లు మాత్రమే అందుకుంది. భారతదేశం నుంచి 3.2 మిలియన్ ఆస్ట్రాజెనెకా మోతాదులను అందుకుంది. మూడు వారాల క్రితం బంగ్లాదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ (పీక్) గరిష్ట స్థాయికి చేరుకుంది. అప్పటి నుండి, రోజువారీ ఇన్ఫెక్షన్లు సగానికి పైగా తగ్గాయి. గురువారం 2,341 కొత్త కేసులు నమోదు కాగా.. 88 కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి బంగ్లాదేశ్ లో 756,955 కేసులు నమోదు కాగా.. 11,393 కరోనా మరణాలు నమోదయ్యాయి.