Bangladesh Boy : ఇదేందయ్యా ఇది ఏడా సూడలె.. దాగుడుమూతలు ఆడుతూ ఏకంగా దేశాన్నే దాటేసిన బాలుడు

దాగుడుమూతలు ఆడుతూ ఓ బాలుడు ఏకంగా దేశాన్నే దాటేశాడు. తన దేశాన్నే దాటి మరో దేశంలోకి అడుగుపెట్టాడు.

Bangladesh Boy : ఇదేందయ్యా ఇది ఏడా సూడలె.. దాగుడుమూతలు ఆడుతూ ఏకంగా దేశాన్నే దాటేసిన బాలుడు

Bangladesh Boy : కొన్ని సంఘటనలు వినడానికి విడ్డూరంగా ఉంటాయి. చాలా కామెడీగా అనిపిస్తాయి. అలా కూడా జరుగుతుందా అనే డౌట్ వస్తుంది. కానీ, అప్పుడప్పుడు ఎవరూ ఊహించని ఘటనలు అలా జరిగిపోతుంటాయి అంతే. ఇప్పుడు చెప్పుకోబోయే ఇన్సిడెంట్ అలాంటిదే. అసలు ఎవరూ ఊహించి ఉండరు.

మ్యాటర్ ఏంటంటే.. దాగుడుమూతలు ఆడుతూ ఓ బాలుడు ఏకంగా దేశాన్నే దాటేశాడు. ఏంటి షాక్ అయ్యారు కదూ. ఆడుకుంటూ దేశాన్ని దాటేయడం ఏంటి? కామెడీ చేయొద్దు అని అంటారా? కానీ, ఇది నిజం. కామెడీ కాదు. ఓ బాలుడు ఆడుకుంటూ ఏకంగా దేశాన్నే దాటి మరో దేశంలోకి అడుగుపెట్టాడు.

దాగుడుమూతల ఆటతో 15ఏళ్ల బాలుడు ఏకంగా దేశాన్నే దాటేసిన వింత, విస్మయానికి గురి చేసే ఘటన బంగ్లాదేశ్ లో జరిగింది. చిట్టగాంగ్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి దాగుడుమూతలు ఆడుకుంటున్న ఫాహిమ్ అనే బాలుడు.. ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు కంటైనర్ లో దాక్కుకున్నాడు. అందులో ఉంటే తనను ఎవరు పట్టుకోలేరని అతడు భావించాడు. అయితే, కాసేపటికే అతడు నిద్రలోకి జారుకున్నాడు. బాలుడు కంటైనర్ లో ఉన్న విషయాన్ని కంటైనర్ సిబ్బంది గమనించలేదు. దీంతో వారు కంటైనర్ ను లాక్ చేసి మలేషియా తరలించారు.

Also Read..Naked Man In Goa Beach : బాబోయ్.. నగ్నంగా బీచ్‌లో తిరుగుతున్న వ్యక్తి, వీడియో వైరల్

ఈ నెల 17న మలేషియా పోర్టులో కంటైనర్ ఓపెన్ చేశారు. అంతే, అందులో బాలుడిని చూసి అంతా షాక్ అయ్యారు. కంటైనర్ లో బాలుడు ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, ఆరు రోజుల పాటు ఆ కుర్రాడు ఎలాంటి ఆహారం, నీరు లేకుండానే కంటైనర్ లో గడపటం అందరినీ మరింత విస్మయానికి గురి చేసింది.

కంటైనర్ ఓపెన్ చూసి చూడగా అందులో బాలుడిని చూసి మలేషియా పోర్ట్ సిబ్బంది షాక్ అయ్యారు. ఆ బాలుడు అయోమయంగా ఉన్నాడు. బాగా నీరసించిపోయి ఉన్నాడు. అంతేకాదు ఏమీ మాట్లాడటం లేదు. మలేషియా స్థానిక భాష కూడా అర్థం కాలేదు. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కారణంగా ఆ బాలుడితో ఎలా మాట్లాడాలో అర్థం కాక జుట్టు పీక్కున్నారు పోర్ట్ సిబ్బంది.

Also Read..Heart Attack In Gym : షాకింగ్ వీడియో.. జిమ్ చేస్తుండగా గుండెపోటుతో మృతి

కాగా, స్థానిక అధికారులు.. ఇది మానవ అక్రమ రవాణ కేసు అయి ఉండొచ్చని తొలుత అనుమానించారు. ఎవరో బాలుడిని అక్రమంగా తరలించి ఉంటారని డౌట్ పడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగుచూసింది. అది మానవ అక్రమ రవాణ వ్యవహారం కాదని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. స్నేహితులతో కలిసి హైడ్ అండ్ సీక్ (దాగుడుమూతలు) ఆడుతూ 15ఏళ్ల ఫాహిమ్.. దాక్కోవడానికి కంటైనర్ ఎక్కాడని, అనుకోకుండా అందులో లాక్ అయిపోయాడని, ఆ తర్వాత నిద్రలోకి జారుకున్నాడని తెలుసుకున్నారు.

ఏకంగా 6 రోజుల పాటు బాలుడు కంటైనర్ లో ఉండిపోయాడు. సాయం కోసం అతడు ఆర్తనాదాలు చేశాడు. కానీ, ప్రయోజనం లేకపోయింది. అతడి కేకలు కంటైనర్ దాటి బయటకు వినిపించలేదు. అయితే, మరింత షాకింగ్ విషయం ఏంటంటే.. ఆరు రోజుల పాటు ఆహారం కనీసం నీరు కూడా తీసుకోకపోయినా.. బాలుడు ప్రాణాలతో బతికి ఉండటం అందరినీ మరింత నివ్వెరపోయేలా చేసింది. ఆ బాలుడు ప్రాణాలతో ఎలా బతికాడు అనేది మిస్టరీగా మారింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మలేషియా పోర్ట్ సిబ్బంది.. బాలుడి ఫొటోలు, వీడియోలు తీశారు. ఆ బాలుడు చాలా అయోమయంగా కనిపిస్తున్నాడు. ఆహారం లేకపోవడంతో బాగా నీరసించిపోయాడు. కంటైనర్ నుంచి బయటకు వచ్చి బిక్క చూపులు చూశాడు. అతడి పరిస్థితి తెలుసుకుని చలించిపోయిన అధికారులు వెంటనే అతడి అంబులెన్స్ లో ఎక్కించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేకాదు.. బాలుడు కోలుకున్న వెంటనే.. అతడిని తిరిగి తన స్వదేశం బంగ్లాదేశ్ పంపేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మలేషియా పోర్టు అధికారులు.