Bangladesh: బంగ్లాదేశ్‌ రాజధానిలో పేలుడు.. 14 మంది మృతి.. 100 మందికిపైగా గాయాలు

పాత ఢాకా నగరం, సిద్ధిక్ బజార్‌లో ఉన్న ఒక ఏడంతస్థుల బిల్డింగులో మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో పేలుడు సంభవించింది. శానిటరీ ఉత్పత్తులు ఉన్న ఈ బిల్డింగ్ కింది అంతస్థులో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి 14 మంది మరణించారు.

Bangladesh: బంగ్లాదేశ్‌ రాజధానిలో పేలుడు.. 14 మంది మృతి.. 100 మందికిపైగా గాయాలు

Bangladesh: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 14 మంది మరణించారు. పాత ఢాకా నగరం, సిద్ధిక్ బజార్‌లో ఉన్న ఒక ఏడంతస్థుల బిల్డింగులో మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో పేలుడు సంభవించింది. శానిటరీ ఉత్పత్తులు ఉన్న ఈ బిల్డింగ్ కింది అంతస్థులో భారీ పేలుడు జరిగింది.

Nagpur: ప్రాణం తీసిన వయాగ్రా.. రెండు మాత్రలు వేసుకుని వ్యక్తి మృతి

ఈ పేలుడు ధాటికి 14 మంది మరణించారు. మరో వంద మందికిపైగా గాయపడ్డారు. పేలుడు ప్రభావంతో బిల్డింగులోని ఇతర ఫ్లోర్లలో ఉన్న వాళ్లు కూడా గాయపడ్డారు. బిల్డింగ్ చాలా వరకు ధ్వంసమైంది. పేలుడు సమయంలో బిల్డింగ్ దగ్గరలో ఆగి ఉన్న ఒక బస్సుతోపాటు రోడ్డు కూడా ధ్వంసమైంది. ఈ ఘటనలో మరణించిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఘటన సమచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు, సహాయక బృందాలు రక్షణ చర్యలు చేపట్టాయి.

క్షతగాత్రుల్ని ఢాకా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, ఇప్పటివరకు పేలుడుకు గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదని స్థానిక మీడియా తెలిపింది.