Bangladesh: నేషనల్ పవర్ గ్రిడ్ ఫెయిల్.. అంధకారంలో బంగ్లాదేశ్.. చీకట్లోనే 14 కోట్ల మంది

నేషనల్ పవర్ గ్రిడ్ ఫెయిల్ కావడంతో బంగ్లాదేశ్ దాదాపు పూర్తిగా అంధకారంలోనే ఉంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయం నుంచి దేశంలో కరెంటు పోయింది. కరెంటు పునరుద్ధరించేందుకు ఇంకా చాలా సమయం పడుతుందని అధికారులు అంటున్నారు.

Bangladesh: నేషనల్ పవర్ గ్రిడ్ ఫెయిల్.. అంధకారంలో బంగ్లాదేశ్.. చీకట్లోనే 14 కోట్ల మంది

Bangladesh: బంగ్లాదేశ్ తీవ్ర కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. నేషనల్ పవర్ గ్రిడ్ ఫెయిల్ కావడంతో దేశమంతా అంధకారంలోనే మగ్గుతోంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి దేశం మొత్తం కరెంటు పోయింది.

Type-C Cable: చార్జింగ్ కేబుల్ కష్టాలకు చెల్లు.. ఇకపై అన్ని గాడ్జెట్లకు ఒకటే కేబుల్.. చట్టం చేసిన యురోపియన్ యూనియన్

వాయువ్య బంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలో ఎక్కడా కరెంటు లేదు. దీంతో దాదాపు 14 కోట్ల మందికిపైగా ప్రజలు ఏడెనిమిది గంటలుగా చీకట్లోనే ఉన్నారు. దేశ రాజధాని ఢాకాతోపాటు పలు నగరాలు కరెంటు కోతతో అల్లాడుతున్నాయి. ప్రస్తుతం విద్యుత్ శాఖకు సంబంధించిన ఇంజనీర్లు పవర్ గ్రిడ్ ఫెయిల్ అవ్వడానికిగల కారణాలను కనుక్కునే పనిలో ఉన్నారు. ఉత్తర బంగ్లాదేశ్‌లోని ఒక ప్రాంతంలో సమస్య తలెత్తినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ సమస్యను గుర్తించి, పరిష్కరించేందుకు మరికొన్ని గంటల సమయం పడుతుందని అంటున్నారు. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ కొంత ఆర్థిక ప్రగతి సాధిస్తున్నప్పటికీ, విద్యుత్ కోతలు ఆ దేశాన్ని ఇబ్బంది పెడుతున్నాయి.

Jio 5G Launch: రేపే జియో 5జీ సేవలు ప్రారంభం.. ఈ నాలుగు నగరాల్లో ట్రయల్ రన్.. అన్‌లిమిటెడ్ డాటా

చమురు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని భారీగా తగ్గించారు. పెరిగిన చమురు ధరలే దీనికి కారణం. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో మొత్తానికి అవసరమైన విద్యుత్‌లో 6 శాతం మాత్రమే చమురు ద్వారా ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం అక్కడ గార్మెంట్ పరిశ్రమలు 4-5 గంటలు మాత్రమే పనిచేస్తున్నాయి. బంగ్లాదేశ్.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గార్మెంట్ ఎగుమతి దారుగా ఉంది. అయితే, విద్యుత్ కోతల కారణంగా అదే రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది.