మహిళలే బెటర్…అప్పుడు అలా ఊహించుకునేవాడిని

  • Published By: venkaiahnaidu ,Published On : December 16, 2019 / 12:47 PM IST
మహిళలే బెటర్…అప్పుడు అలా ఊహించుకునేవాడిని

ఒక‌వేళ ఈ ప్రపంచంలోని ప్ర‌తి దేశాన్ని మ‌హిళే ఏలితే.. అప్పుడు జీవ‌న ప్ర‌మాణాలలో మరింత వృద్ధి ఉంటుందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. సింగ‌పూర్‌లో లీడర్ షిప్ పై జ‌రిగిన ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఒబామా…ఆడ‌వాళ్ల గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశారు. అన్ని విష‌యాల్లో మ‌హిళ‌లు ఫ‌ర్ఫెక్ట్ కాదు,కానీ పురుషుల క‌న్నా వారు బెట‌ర్ అన్న‌ది మాత్రం నిర్వివాదాంశం అన్నారు. ప్రపంచంలో చాలా స‌మ‌స్య‌లు వృద్ధుల వ‌ల్ల ఉత్ప‌న్నం అయ్యాయ‌ని, దాంట్లో ఎక్కువ శాతం మ‌గ‌వారు అధికారంలో ఉండ‌డం వ‌ల్ల ఆ స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు. సోష‌ల్ మీడియా వ‌ల్ల ఎక్కువ దుష్ప్ర‌చారం జ‌రుగుతోంద‌న్నారు.

మ‌హిళ‌లు రాజ్యాధికారాన్ని చేప‌డితే, అప్పుడు ఈ ప్ర‌పంచం ఎలా ఉంటుందో అని తాను అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో ఊహించ‌కునేవాడిన‌ని ఆయన తెలిపారు. భూమిపై ఉన్న ప్ర‌తి దేశాన్ని మహిళలు రెండేళ్లపాటు పరిపాలిస్తే అన్ని రంగాల్లో పురోగ‌తి క‌నిపిస్తుంద‌ని తనకు నమ్మకముందన్నారు. రాజకీయ నాయకత్వంలోకి తిరిగి వెళ్లడాన్ని ఎప్పుడైనా పరిశీలిస్తారా అని అడిగినప్పుడు, సమయం వచ్చినప్పుడు నాయకులు పక్కకు తప్పుకుంటారని తాను నమ్మేవాడినని ఒబామా తెలిపారు.

ఉద్యోగం చేయ‌డానికి మాత్రమే తామున్నామ‌న్న విష‌యాన్ని రాజ‌కీయ నేత‌లు గుర్తుంచుకోవాల‌ని ఒబామా అన్నారు. జీవితం మొత్తం రాజ‌కీయాలే కాదు అని, అధికారాన్ని అనుభ‌వించ‌డం ల‌క్ష్యంగా ఉండ‌కూడ‌ద‌న్నారు. 2009నుంచి 2017వరకు అమెరికా అధ్యక్షుడిగా సేవలందించిన ఒబామా…వైట్ హౌస్ నుంచి బయటికొచ్చిన తర్వాత భార్య మిచెల్ ఒబామాతో కలిసి ప్రపంచవ్యాప్తంగా యువ నాయకులకు మార్గదర్శకత్వం వహించే ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. ఒబామా ఫౌండేషన్ ఈవెంట్ లో పాల్గొనేందుకు గతవారం ఈ దంపతులు మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్లిన విషయం తెలిసిందే.