కరోనాను తట్టుకోగల శక్తి గబ్బిలాల్లో ఏముంది? మనుషులకు గబ్బిలాలకు మధ్య వాహకం ఏంటి? 

  • Published By: sreehari ,Published On : April 16, 2020 / 01:47 AM IST
కరోనాను తట్టుకోగల శక్తి గబ్బిలాల్లో ఏముంది? మనుషులకు గబ్బిలాలకు మధ్య వాహకం ఏంటి? 

మనుషులను పట్టిపీడుస్తున్న కరోనా మమహ్మారి గబ్బిలాల నుంచి వ్యాపించిందా? అయితే గబ్బిలాల్లో ఉన్న ఈ ప్రాణాంతక వైరస్ వాటిని ఏం చేయలేకపోతుంది? కేవలం మనుషులపైనే ఎందుకింతగా ప్రాణాంతకంగా మారింది? గబ్బిలాల్లో ఉన్న ఆ శక్తి ఏంటి? మనుషుల్లో వైరస్ తట్టుకోగల శక్తి లేదా? ప్రాణాలు తీసే కరోనాను వ్యాప్తి చేస్తున్న గబ్బిలాల్లో అంత పవర్ ఉందా? ఇంతకీ ఏంటి? ఆ పవర్ ఇదే పరిశోధకుల్లో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయినప్పటికీ శాస్త్రవేత్తలు గబ్బిలాల్లో కరోనా గుట్టును రట్టు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 

గతంలో ప్రబలిన నిఫా, ఎబోలా వైరస్‌ల మాదిరిగానే కరోనా వైరస్‌ గబ్బిలాల నుంచే సోకిందని సైంటిస్టులు తొలుత భావించారు. కరోనా వైరస్‌ను గుర్తించిన చైనాలోని వుహాన్‌లోని కరోనా పేషెంట్ల నుంచి చైనా శాంటిస్టులు శాంపిల్స్‌ సేకరించారు. ఇతర వైరస్‌ల జన్యు క్రమాలతో వాటిని పోల్చారు. చైనాలోని (హార్స్‌షూ)గబ్బిలాల్లో లభించిన వైరస్‌ జన్యుక్రమంతో ఈ శాంపిల్‌లోని వైరస్‌ జన్యుక్రమం 96శాతం సరిపోలినట్టు గుర్తించారు. అయితే, ఈ వైరస్‌ నేరుగా గబ్బిలం నుంచి మనిషికి సోకలేదనే సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. గబ్బిలాల నుంచి మనుషులకు కరోనా సోకడానికి మధ్య ఏదో ఒక వాహకం ఉండి తీరాలి. దాని కారణంగానే గబ్బిలాల్లో ఉండే వైరస్ మనుషుల్లోకి ప్రవేశించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

SARS వ్యాధికి కారణమైన కరోనా వైరస్‌.. గబ్బిలం నుంచి ముంగిస జాతికి చెందిన వాహకం ద్వారా మనుషులకు సోకినట్లు చెబుతున్నారు. MERS వ్యాధి గబ్బిలం నుంచి ఒంటె ద్వారా మనుషులకు సోకినట్లు నిర్ధారించినట్టు గట్టిగా చెబుతున్నారు. సాధారణంగా గబ్బిలాల్లో వేలాది వైరస్‌లు ఉంటాయి. మనుషులకు సోకే ప్రమాదకరపు వైరస్‌‌లు దాదాపు 130 రకాల వైరస్‌లను గబ్బిలాల్లో గుర్తించారు. గబ్బిలాలు విసర్జించే మల, మూత్రాలు, ఉమ్మి ద్వారా వైరస్‌ను వ్యాప్తి చేస్తాయి. వైరస్‌లకు ఆవాసమైన గబ్బిలాలపై ఆ వైరస్‌ ప్రభావం ఎందుకు పనిచేయదనే ప్రశ్న తలెత్తుతోంది. (ఏపీలో కరెన్సీ నోట్లతో కరోనా.. నిజమెంత..)

ఈ ప్రశ్నకు సమాధానం సింగపూర్‌లోని డ్యూక్‌ NUS మెడికల్‌ స్కూల్‌లో గబ్బిలాల్లోని వైరస్‌లపై పరిశోధన చేస్తున్న లిన్ఫా వాంగ్‌ బదులిచ్చారు. గబ్బిలం ఓ క్షీరద జాతిగా వారు పేర్కొన్నారు. ఎగిరే క్షీరదాల్లో గబ్బిలాల శరీర ఉష్ణోగ్రత 100F వరకు ఉంటుంది. వాటి గుండె నిమిషానికి 1000 కన్నా ఎక్కువ సార్లు కొట్టుకుంటుందని చెప్పారు. ఇలా జరిగితే మిగతా క్షీరదాలైతే వెంటనే చచ్చిపోతాయి.

కానీ, పైకి ఎగిరే సమయంలో కలిగే ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రత్యేక వ్యాధి నిరోధక వ్యవస్థను గబ్బిలాలు ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. అందుకే గబ్బిలాలు తమ శరీరంపై వైరస్‌ల ప్రభావాన్ని నాశనం చేసే ప్రత్యేక రోగ నిరోధక వ్యవస్థ కణాలను (యాంటీ బాడీస్) స్వయంగా తయారుచేసుకుంటాయి. గబ్బిలాల శరీరంపై వైరస్ ల పుట్టలా ఉంటాయి.. వైరస్‌ల ప్రభావాన్ని తట్టుకోగల శక్తిని కలిగి ఉండటం కారణంగానే వైరస్ బారిన పడకుండా గబ్బిలాలు ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాయని వాంగ్‌ తెలిపారు.