నొప్పులు తగ్గాలంటే బీరు: పెయిన్ కిల్లర్ కంటే పవర్ ఫుల్

  • Published By: vamsi ,Published On : October 9, 2019 / 05:10 AM IST
నొప్పులు తగ్గాలంటే బీరు: పెయిన్ కిల్లర్ కంటే పవర్ ఫుల్

సరదాగా.. వ్యసనంగా.. కొందరు బాధలో.. మరికొందరు సంతోషంలో తాగే బీరు నొప్పలకు మందట. ఈ విషయం చెబుతుంది ఎవరో తెలుసా? లండన్ గ్రీన్ విచ్ యూనివర్శిటీ పరిశోధకులు.. తలనొప్పి, ఒళ్లు నొప్పులు.. లాంటి ఇబ్బంది కలిగినప్పుడు పెయిన్ కిల్లర్ తీసుకుంటారు కదా? కానీ నొప్పి తగ్గడానికి పారాసెట్మాల్ లాంటి పెయిన్ కిల్లర్ వేసుకోవడం కంటే బీరు తాగడం మేలు అని అధ్యయనంలో తేలింది.

నాలుగు వందలమందికి పైగా వ్యక్తులపై గ్రీన్ విచ్ వర్సిటీ పరిశోధకులు జరిపిన 18 అధ్యయనాల్లో ఈ విషయం తెలిందని పరిశోధకులు వెల్లడించారు. ఆల్కహాల్ ఒక మంచి అనల్జిసిక్ (పెయిన్ రిలీవర్ డ్రగ్) అని వారి స్టడీలో వెల్లడైందట. ఇది క్లినికల్ గా కూడా ఫ్రూవ్ అయిందని చెబుతున్నారు పరిశోధకులు. నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఆల్కహాల్ వేగంగా పని చేస్తుందని, కానీ మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం దీర్ఘ కాలంలో ప్రమాదం అని తెలిపారు.

రెండు గ్లాసుల బీరు తాగితే మన రక్తంలో 0.08 శాతం ఆల్కహాల్ లెవల్ పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. ఇది నొప్పి తీవ్రతను తగ్గించి, నొప్పిని తట్టుకుని శరీరానికి ఉపశమనం ఇస్తుందని పరిశోధకులు వెల్లడించారు. పారాసెట్మాల్ వంటి కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్ల కంటే బీరు బాగా పని చేస్తుందని తమ అధ్యయనంలో పక్కాగా తేలిందని డాక్టర్లు తెలిపారు. అయితే బీరు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని డాక్టర్లు హెచ్చరించారు.