బీరు యోగా క్లాసెస్..ఆసక్తి చూపుతున్న యూత్

బీరు యోగా క్లాసెస్..ఆసక్తి చూపుతున్న యూత్

Beer yoga classes : ఓ చేతిలో బీరు పట్టుకుని యోగా చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. యువత బీరు తాగుతూ…యోగా చేస్తుండడం హాట్ టాపిక్ అయ్యింది. నలుగురితో కలిసి హాయిగా..బీరు సిప్ చేస్తూ..యోగా చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికంతటికీ కారణం ఉంది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో ఎక్కడికక్కడే ప్రజలు ఇంట్లోనే బందీ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Cambodia

దీంతో వారి మానిసక ఆరోగ్యంపై ప్రభావం చూపెట్టిందని నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా..యూత్ చాలా సమస్యలు ఎదుర్కొన్నారని అంటున్నారు. దీంతో బీర్ యోగా అంటూ ముందుకు తీసుకొచ్చారు. ఇది ఆసియా దేశం కాంబోడియాలో ఆసక్తికరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి.

TwoBirds

TwoBirds

కాంబోడియాలో ప్రధాన నగరాల్లో ఒకటైన నామ్ ఫెన్ లో యువతకు బీర్ యోగా ఉపశమనం కలిగిస్తోందంట. దీనిని ప్రముఖ బీరు తయారీ సంస్థ టూ బర్డ్స్ క్రాప్ట్ బీర్ బ్రూవరీ నిర్వహిస్తోంది. దీనికి బాగానే రెస్పాండ్ వస్తోందని తెలుస్తోంది. బీరు యోగాతో తమకు ఎంతో ఆనందం..ఉల్లాసం కలుగుతోందని అక్కడి యూత్ వెల్లడిస్తోంది. కానీ..అచ్చమైన యోగా సాధన కాదని, కేవలం ఫ్రెండ్స్ తో కలిసి ఉల్లాసంగా గడపడమేనంటున్నారు.

BeerPro

యోగాసానాలతో వినోదం కూడా వస్తోందన్నారు. బీరు యోగాతో తమకు ఎంతో వినోదం లభిస్తోందని స్రేలిన్ బచా యువతి వెల్లడిస్తోంది. ఆసియాలో కాంబోడియా చిన్న దేశం. కరోనా వైరస్ ను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంది. ఇప్పటి వరకు 456 కరోనా కేసులు రాగా..399 మంది కోలుకున్నారు. ఎవరూ కూడా చనిపోలేదు. ఆరు వారాలు మాత్రమే లాక్ డౌన్ విధించిన తర్వాత..పలు ఆంక్షలను తొలగించారు.